Sudigali Sudheer GOAT Trailer:ఒక వైపు ఎంటర్ టైన్ మెంట్ షోలలో యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాలలో హీరోగా తన లక్ ని టెస్ట్ చేసుకుంటున్నాడు సుడిగాలి సుధీర్.ఇలా ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్ ,గాలోడు, కాలింగ్ సహస్ర ,వాంటెడ్ పండుగాడు వంటి సినిమాలతో పలకరించిన సుధీర్ ఇపుడు ‘గోట్’ (GOAT) అనే మరో సినిమాతో ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ కి సిద్దం కాగా తాజాగా సినిమా నుండి ట్రైలర్ వదిలింది మూవీ యూనిట్.
వేదవ్యాస్ ఆకుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యభారతి కథానాయికగా నటిస్తోంది.ఇక ఇప్పటివరకు సుధీర్ నటించిన సినిమాలతో పోలిస్తే, ఈసారి ఆయన కామెడీతో పాటు క్రైమ్, గ్యాంబ్లింగ్, కిడ్నాప్, మాస్ యాక్షన్ అంటూ కాస్త డిఫరెంట్ గా కనిపించే ప్రయత్నం చేసినట్టే కనిపిస్తుంది.
ఇక వదిలిన ట్రైలర్ చూస్తే ఈ సినిమా రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగుతుందని అర్థమవుతుంది.మాములుగా బెట్టింగ్ అనగానే కేవలం క్రికెట్ మ్యాచ్‌లే గుర్తుకొస్తాయి, కానీ ఈ సినిమాలో కోడిపందేలు వాటి వెనుక ఉండే అక్రమ వ్యవహారాలు, డబ్బు వంటి విషయాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు మేకర్స్.సినిమాలో “జంతువులు మనుషుల్లా అవకాశాల కోసం నమ్మకద్రోహం చేయవు” వంటి డైలాగులు సినిమా లో గట్టిగానే పేలేలానే కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో సుధీర్ స్నేహితులతో కలిసి చిన్న చిన్న పనులు చేసుకునే గ్యాంగ్ లీడర్‌గా కనిపిస్తూ కామెడీ పండించాడు.అయితే కామెడీ మాత్రమే కాకుండా, సీరియస్ క్రైమ్ సీన్స్ లలో కూడా సుధీర్ కీ రోల్ పోషించనున్నాడని అర్థం అయిపోతుంది. ఇక ఈ ట్రైలర్లో డబ్బు కోసం ఒక పెళ్లికూతురిని (దివ్యభారతి) కిడ్నాప్ చేయడం,తనకి ‘సూసైడల్ రికరెన్స్ మెటబాలిక్ సిండ్రోమ్’ అనే వింత వ్యాధి ఉన్నట్లు చూపించడం, ఆమె వల్ల కిడ్నాపర్లే కంగారు పడటం వంటి కామెడీ సీన్స్ థియేటర్ లో పేలడం పక్కా.
ALSO READ :మంగ్లీ వర్సెస్ ప్రభ.. ఫోక్ సాంగ్స్‌లో అసలు వార్ మొదలైందా?
ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ, పృథ్వీరాజ్, చమ్మక్ చంద్ర వంటి సీనియర్స్ కూడా కథలో కీ రోల్ పోషించబోతున్నారని అర్థం అవుతుంది. జూదాన్ని మహాభారతంలోని ధర్మరాజు పాత్రతో పోలుస్తూ చెప్పే డైలాగ్స్ హైలెట్ అని చెప్పాలి.ఇక లియోన్ జేమ్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌లోని కామెడీ, యాక్షన్ సీన్స్ కి సరిగ్గా సరిపోయిందని చెప్పాలి.ఇక చివర్లో వినిపించే ‘జై బాలయ్య’ స్లోగన్ అయితే నెక్స్ట్ లెవెల్. చూడాలి మరి ట్రైలర్ తో అంచనాలు పెంచేస్తున్న ‘గోట్’ (GOAT)నవంబర్ 12న ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !