Mouli Little Hearts:లిటిల్ హార్ట్స్ సినిమాతో ఓవర్ నైట్ హీరో అయిపోయాడు మౌళి.యూట్యూబర్ గా సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 40 కోట్ల వసూల్లని కొల్లగొట్టడంతో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. ఇక తాజాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీను కంబాల దర్శకత్వంలో హీరోగా దొంగనా కొడుకు అనే సినిమా చేయగా అది ఈ నెల 13న రిలీజ్ కి రెడీ అయిపొయింది.ఇక ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మౌళి పలు ఆసక్తికమైన విషయాలని చెప్పుకొచ్చాడు.
తాజాగా కొంతమంది నెటిజన్లు తమిళంలో ప్రదీప్ రంగనాథన్, మలయాళంలో నస్లెన్, తెలుగులో మౌళి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక దీనిపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు ఇలాంటి పోస్టులు తనను కావాలనే తిట్టించడానికి పెడుతున్నట్లుగా అనిపిస్తుందని వాపోయాడు. వాళ్లే ముందు ముగ్గురినీ పోలుస్తూ పోస్టులు పెడతారని, ఆ తర్వాత వాళ్లు పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతే తననే ట్రోల్ చేస్తుంటారని చెప్పుకొచ్చాడు.నిజంగా వాళ్ళు నన్ను హీరోగా కన్సిడర్ చేస్తూ ఈ పోస్టులు పెడతారా లేక కావాలనే ట్రోల్ చేసే క్రమంలో భాగంగా ఇలా పోస్ట్ లు పెడతారా తెలీదని తెలిపాడు.
అయితే తానూ యూట్యూబర్ గా చాలా మందికే పరిచయం ఉన్నప్పటికీ లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఒక ఇండిపెండెంట్ స్పేస్ లో తీసిందని ,అసలు అది ఆ స్థాయిలో హిట్ అవుతుందని కూడా అనుకోలేదని చెప్పుకొచ్చాడు. దయ చేసి నన్ను ప్రదీప్ ,నెస్లేన్ లతో నన్ను పోల్చకండి బాబోయ్ ..నేనింకా చేసింది ఒక్క సినిమానే అని సరదాగా ఆడియన్స్ ని వేడుకున్నాడు ఈ కుర్ర హీరో.
ఇక మౌళి సినీ కెరీర్ విషయానికి వస్తే మౌళి టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ తో యూట్యూబర్ గా నెటిజన్లకి పరిచయం అయిన మౌళి, ఆ తర్వాత వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ’90s’ వెబ్ సిరీస్ మౌళికి నటుడిగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి.ఇక ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపొయాడు. పెద్దగా స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, తనదైన కామెడీ టైమింగ్, సింపుల్ యాక్టింగ్ తో యూత్‌కు ఫేవరేట్ అయిపోయాడు.
ఈ క్రేజ్ వచ్చిన తర్వాతే ఇతర భాషల స్టార్స్ తో పోలుస్తూ పోస్టులు వదులుతున్నారు నెటిజన్లు. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ కూడా మొదట్లో యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలతో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించినవాడే,ఇక మలయాళంలో నస్లెన్ కూడా తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ అందునా కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.దీంతో ఇపుడు ఈ ముగ్గురిని పోలుస్తూ పోస్టులు పెట్టేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఈ కుర్ర హీరో ముందు ముందు వారిలా పేరు తెచ్చుకుంటాడో లేదో !
ALSO READ :బిగ్ బాస్ లో సుధీర్‌ను గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మి స్పెషల్ రిక్వెస్ట్!