E-Paper
Advertisement

ప్రపంచమంతా జాంబీల రాజ్యమే… బతకడానికి ఓ గ్యాంగ్‌ చేసే పిచ్చి సాహసాలు… కిరాక్ అడ్వంచర్ కామెడీ

ప్రపంచమంతా జాంబీల రాజ్యమే… బతకడానికి ఓ గ్యాంగ్‌ చేసే పిచ్చి సాహసాలు… కిరాక్ అడ్వంచర్ కామెడీ
Advertisement

Zombie Comedy Movie: జాంబీ సినిమాలు చూడటానికి ఇష్టపడే వారికి హాలీవుడ్‌లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ భయపెట్టడంతో పాటు కడుపుబ్బా నవ్వించే సినిమాలు మాత్రం చాలా తక్కువ. అలాంటి సినిమాల్లో ‘జాంబీల్యాండ్’ సిరీస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. భయంకరమైన జాంబీలు, వాటి నుంచి తప్పించుకునేందుకు హీరోలు వేసే పిచ్చి ప్లాన్స్, మధ్యమధ్యలో పేలే కామెడీ కౌంటర్స్‌తో ఈ ఫ్రాంచైజీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా 2019లో వచ్చిన ‘జాంబీల్యాండ్: డబుల్ ట్యాప్’ (Zombieland: Double Tap) మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసింది. వుడీ హారెల్సన్, జెస్సీ ఐసెన్‌బర్గ్, ఎమ్మా స్టోన్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ సినిమా హారర్, కామెడీ, యాక్షన్ అంశాలతో ఆద్యంతం ఎంటర్‌టైన్ చేస్తుంది. మరి ఈ జాంబీ గ్యాంగ్ చేసే సాహసాలేంటి? ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే..

ప్రపంచమంతా ఓ ప్రాణాంతక వైరస్ కారణంగా జాంబీల రాజ్యంగా మారిపోతుంది. ఎక్కడ చూసినా మనుషులను వేటాడుతూ, కనిపించిన వారిపై దాడి చేసే జాంబీలే కనిపిస్తుంటాయి. అలాంటి ప్రమాదకరమైన ప్రపంచంలో ప్రాణాలతో బయటపడిన నలుగురు వ్యక్తులు ఒక టీమ్‌గా మారతారు. వారే కొలంబస్, టాలహాస్సీ, విచితా, లిటిల్ రాక్. మొదటి భాగంలో ఎదురైన ప్రమాదాల నుంచి బయటపడ్డ ఈ నలుగురూ ఇప్పుడు వైట్‌హౌస్‌ను తమ సురక్షిత నివాసంగా మార్చుకుంటారు. బయట ప్రపంచంలో జాంబీలు తిరుగుతున్నా, అక్కడ మాత్రం వీరు హాయిగా జీవిస్తుంటారు. అయితే ఇక్కడ కూడా ప్రశాంతత ఎక్కువ రోజులు ఉండదు. ఒకవైపు కొలంబస్, విచితా మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంటే.. మరోవైపు టాలహాస్సీ, లిటిల్ రాక్‌తో తనకున్న అనుబంధం విషయంలోనూ సమస్యలు మొదలవుతాయి.

Advertisement

ఈ క్రమంలో లిటిల్ రాక్ తనకు నచ్చిన వ్యక్తితో కలిసి గ్యాంగ్ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. దీంతో ఆమెను వెతికి తిరిగి తీసుకురావడానికి మిగతా ముగ్గురూ ప్రయాణం మొదలుపెడతారు. వైట్‌హౌస్ నుంచి బయలుదేరిన వీరు మెంఫిస్‌లోని గ్రేస్‌ల్యాండ్ వైపు వెళ్తారు. ఈ ప్రయాణంలో వీరికి ఎన్నో వింత మనుషులు పరిచయమవుతారు. ముఖ్యంగా మాడిసన్ అనే అమ్మాయి ఎంట్రీతో కథలో మరింత కామెడీ మొదలవుతుంది. ఆమె అమాయకత్వం, విచిత్రమైన ప్రవర్తన గ్యాంగ్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

అయితే అసలు ప్రమాదం మాత్రం జాంబీల రూపంలో ఎదురవుతుంది. ఈసారి వైరస్ కారణంగా కొన్ని జాంబీలు మరింత వేగంగా, తెలివిగా, బలంగా మారిపోతాయి. సాధారణ జాంబీలను సులభంగా ఎదుర్కొనే ఈ గ్యాంగ్‌కు కొత్త రకం జాంబీలతో పోరాడటం పెద్ద సవాలుగా మారుతుంది. ఇక వీరంతా కలిసి జాంబీలను ఎదుర్కొనే క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఫన్నీ సిచువేషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో జాంబీల గుంపుతో జరిగే పోరాటం అదిరిపోతుంది. అసలు ఈ గ్యాంగ్ లిటిల్ రాక్‌ను తిరిగి కలుసుకుంటుందా? కొత్త రకం జాంబీల నుంచి ఎలా బయటపడుతుంది? అనే విషయాలు సినిమా చూస్తేనే తెలుస్తాయి.

తెలుగులో ఉందా ?

Advertisement

హాలీవుడ్ స్టార్స్ ఉడీ హారెల్సన్, ఎమ్మా స్టోన్ నటించిన ఈ క్రేజీ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ JioHotstar లో అఫీషియల్ గా లభ్యమవుతోంది. మన తెలుగు ఆడియన్స్ కోసం ప్రాపర్ తెలుగు డబ్బింగ్ ఆడియోతో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాలో టాలహాస్సీ పాత్రలో వుడీ హారెల్సన్, కొలంబస్‌గా జెస్సీ ఐసెన్‌బర్గ్, విచితాగా ఎమ్మా స్టోన్, లిటిల్ రాక్‌గా అబిగైల్ బ్రెస్లిన్ నటించారు. రూబెన్ ఫ్లీషర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది. వీకెండ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఓ హాలీవుడ్ జాంబీ మూవీ చూడాలనుకుంటే ‘జాంబీల్యాండ్: డబుల్ ట్యాప్’ మంచి ఛాయిస్.

Read Also: చావు నీడలో ఉన్న 40 ఏళ్ల మహిళ… లక్షలు పోసి కుర్రాడిని కొనుక్కుంటే… నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ భయ్యా

Tags

Related News

కడుపుబ్బా నవ్వించే కామెడీ నుంచి ఏడిపించే ఎమోషన్స్ వరకు… ఒకే ఓటీటీలో 4 తమిళ సినిమాల రచ్చ

కళ్ళు కనిపించని అమ్మాయికి పెళ్లి.. తన లోపాన్ని దాచేందుకు ఫ్యామిలీ పడే తిప్పలు చూస్తే నవ్వులే నవ్వులు!

ఒకే రోజు ఓటీటీలోకి రెండు మలయాళం సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జానర్.. వీకెండ్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న కొడుకు… దీపావళికి ఇంటికొస్తే దిమ్మతిరిగే షాక్… ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన డ్రామా

ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టేందుకు మాస్టర్ ప్లాన్… అదే టైమ్‌లో పోలీసుల రచ్చ… నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చే కామెడీ క్రైమ్

తండ్రి కోసం కూతురు ఆడిన ఫేక్ పోలీస్ గేమ్… సీన్లోకి అసలు విలన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్

అఫీషియల్ జైలర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే!

Big Stories

Advertisement
×