E-Paper
Advertisement

ఐశ్వర్య అర్జున్ ఉమాపతి విడాకుల వార్తలు..తంబి రామయ్య రియాక్షన్ ఇదే!

ఐశ్వర్య అర్జున్ ఉమాపతి విడాకుల వార్తలు..తంబి రామయ్య రియాక్షన్ ఇదే!
Advertisement

Umapathi _Aishwarya Arjun Divorce: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజులుగా ప్రముఖ సినీ నటుడు అర్జున్ సర్జ(Arjun Sarja) పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్(Aishwarya Arjun) విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. గత రెండు సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా ఐశ్వర్య అర్జున్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి(Umapathi)తో వివాహం జరిగింది.

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన తంబి రామయ్య..

ఇలా వీరి వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నప్పటికీ వీడి విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలు గత కొద్దిరోజులుగా వైరల్ అవుతున్నాయి. ఇలా వీరి విడాకుల వార్తలు బయటకు రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల అర్జున్ చిన్న కుమార్తె అంజన వివాహం ఇటలీలో ఎంతో వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలలో తంబి రామయ్య(Thambi Ramaiah) కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు. ఇలా తన ఉమాపతి లేకుండా ఐశ్వర్య అర్జున్ మాత్రమే ఈ పెళ్లి వేడుకలలో కనిపించడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారా అనే వార్తలు తెరపైకి వచ్చాయి.

తమ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు..

Advertisement

ఇలా తన కొడుకు కోడలు విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ వార్తలు రావడంతో నటుడు తంబి రామయ్య స్పందించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన విడాకుల వార్తలపై మండిపడ్డారు. మా పిల్లలు విడాకులు తీసుకున్నారని మీకు ఎవరైనా చెప్పారా ?ఇలాంటి పిచ్చి వార్తలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వార్తలను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో తెలియదు కానీ ఈ వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని తెలిపారు. ఐశ్వర్య ఉమాపతి చెన్నైలోని మైలాపూర్ లో నివసిస్తున్నట్టు తంబి రామయ్య తెలిపారు. ఎంతో సంతోషంగా గడుపుతున్న తమ పిల్లల జీవితాలలో ఎందుకు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఈయన మండిపడ్డారు.

అందుకే పెళ్లికి వెళ్లలేదు..

ఇక అర్జున్ చిన్న కుమార్తె పెళ్లి వేడుకకు హాజరు కాకపోవడానికి గల కారణాన్ని కూడా తంబి రామయ్య తెలిపారు. ఈ వివాహపు వేడుక కోసం సుమారు 12 రోజులపాటు ఇటలీలోనే ఉండాల్సి ఉంటుంది. 12 రోజులు ఇటలీలో ఉండటానికి సమయం లేకపోవడంతోనే తమ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ పెళ్లికి హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే త్వరలోనే చెన్నైలో అంజనా వెడ్డింగ్ రిసెప్షన్ చాలా ఘనంగా జరగబోతుందని, ఈ రిసెప్షన్ లో భాగంగా తమ కుటుంబం, బంధు మిత్రులందరు హాజరుకాబోతున్నట్లు ఈ సందర్భంగా తంబి రామయ్య తన కొడుకు ఉమాపతి కోడలు ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ అసలు విషయాన్నీ తెలియచేశారు.

Advertisement

Also Read: యాంకర్ స్రవంతి చొక్కారపు నెల సంపాదన ఎంతో తెలుసా?

Related News

కాకా మూవీకి భారీ డిమాండ్.. చిరంజీవా మజాకా?

‘రామాయణ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టిందా..?

బాలయ్య ఫ్యాన్స్‌కు పండగే.. డిసెంబర్ 24న దాదా దండయాత్ర!

నిహారిక స్టైల్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఏం పోజులమ్మా!

అమ్మానాన్నలకు రూ.50 లక్షల గిఫ్ట్స్.. ప్రజ్వల్ ప్లాన్ మామూలుగా లేదుగా!

రాధిక ఆప్టేకు పాయల్ కౌంటర్.. టాలీవుడ్‌కు అండగా హీరోయిన్!

12 ఏళ్లకే ఇంత కాన్ఫిడెన్సా? ప్రజ్వల్ మామూలోడు కాదు!

Big Stories

Advertisement
×