Kavya Kalyan Ram Bachelor Party: కావ్య కళ్యాణ్ రామ్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలనడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం మసూదా సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా మసూదా, బలగం వంటి సినిమాలలో హీరోయిన్గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కావ్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈమె ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు.
కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ (Kalabhairava) సైతం సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియజేస్తూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కావ్య కాలభైరవ ప్రేమలో ఉన్న విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇదివరకే వీరిద్దరికి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోలు మాత్రం అధికారికంగా ఎక్కడ షేర్ చేయలేదు.
నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) కాలభైరవ డిసెంబర్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ తన స్నేహితులతో కలిసి ఘనంగా బ్యాచిలర్ పార్టీని(bachelor party ) జరుపుకున్నారు. తన స్నేహితులతో కలిసి ఈమె వియత్నాంలో(vietnam) ఈ బ్యాచిలర్ పార్టీని జరుపుకొని తన స్నేహితులతో చిల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను కావ్య తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇలా కావ్య బ్యాచిలర్ పార్టీని జరుపుకోవడంతో వీరి పెళ్లి తేదీ దగ్గర పడుతుందని అందుకే కావ్య ఇలా బ్యాచిలర్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు అయితే ఇప్పటివరకు కావ్య కాలభైరవ పెళ్లికి సంబంధించిన ఏ అప్డేట్ కూడా కీరవాణి ఫ్యామిలీ నుంచి అధికారికంగా వెల్లడి కాలేదు. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించి అన్ని వివరాలను కీరవాణి ఫ్యామిలీ అధికారకంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వీరితో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి కొంతమంది హీరోలు కూడా ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నటుడు తేజ సజ్జ కూడా ఈ ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇలా సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: నచ్చకపోతే రిజెక్ట్ చెయ్యి..రాధిక ఆప్టేపై రెజీనా కామెంట్స్ వైరల్!