E-Paper
Advertisement

కాకా మూవీకి భారీ డిమాండ్.. చిరంజీవా మజాకా?

కాకా మూవీకి భారీ డిమాండ్.. చిరంజీవా మజాకా?
Advertisement

Kaaka Movie:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా చెలామణి అవుతున్న చిరంజీవి (Chiranjeevi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో.. ప్రజాసేవతో ఊహించని పాపులారిటీ సంపాదించుకున్న ఈయన 70 సంవత్సరాల వయసు దాటినా ఇంకా స్టార్ హీరోగా సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ యువ నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకొని.. టాలీవుడ్ కి మంచి ఓపెనింగ్ అందించిన చిరంజీవి.. ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ అనే సినిమాలో నటిస్తున్నారు.

కాకా మూవీకి నిర్మాతలు భారీ డిమాండ్..

‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ మూవీ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే నెలకొన్నాయి. దీనికి తోడు ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ చిరంజీవి కూతురుగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ , నివేదా పేతురాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు భారీ రేంజ్ లో నిర్మాతలు బిజినెస్ మొదలు పెట్టినట్లు ఫిలింనగర్ సర్కిల్స్ లో ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ఏకంగా రూ.70 కోట్లు..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ కలెక్షన్లు రాబట్టి తన రేంజ్ ఏంటో మళ్లీ చూపించారు. ఇప్పుడు కాకా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్లు సినీవర్గాలలో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్లు కోట్ చేస్తున్నట్లు ప్రచారం. సినిమాపై ఉన్న అంచనాలు, చిరంజీవి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మొత్తం కంటే తక్కువకు హక్కులను విక్రయించేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరనే ప్రచారం కూడా నడుస్తూ ఉండడం గమనార్హం. మరి ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకోవడానికి ఏ పంపిణీ సంస్థ ముందుకు వస్తుందో అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.

also read: దొంగ గేమ్ ఆడొద్దు.. కర్మ అనుభవిస్తావ్.. త్రిగుణ్ పై నీతూ మాస్టర్ ఫైర్..

వచ్చే ఏడాది విడుదల..

Advertisement

2027 జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగు ఒకవైపు వేగంగా జరుగుతోంది. మరొకవైపు విడుదలకు ముందే వ్యాపార లావాదేవీల పై మేకర్స్ కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతూ ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఇన్ని అంచనాల మధ్య వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి.

Related News

‘రామాయణ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టిందా..?

బాలయ్య ఫ్యాన్స్‌కు పండగే.. డిసెంబర్ 24న దాదా దండయాత్ర!

నిహారిక స్టైల్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఏం పోజులమ్మా!

అమ్మానాన్నలకు రూ.50 లక్షల గిఫ్ట్స్.. ప్రజ్వల్ ప్లాన్ మామూలుగా లేదుగా!

రాధిక ఆప్టేకు పాయల్ కౌంటర్.. టాలీవుడ్‌కు అండగా హీరోయిన్!

12 ఏళ్లకే ఇంత కాన్ఫిడెన్సా? ప్రజ్వల్ మామూలోడు కాదు!

తమిళ సినిమాల వెంటపడుతున్న నాగవంశీ.. జైలర్ 2 తరువాత మరో మూవీ రిలీజ్ కు సిద్ధం!

Big Stories

Advertisement
×