Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన చేతి మణికట్టు వద్ద గాయమైంది. అయితే ఆ గాయాన్ని ఆయన లెక్కచేయకుండా మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయడం.. ఆ తర్వాత ప్రమోషన్స్ లో పాల్గొనడం అన్నీ అయిపోయాయి. ఇక ఎట్టకేలకు ప్రస్తుతం విరామం లభించడంతో జూలై 27వ తేదీన తన సతీమణి ఉపాసన (Upasana ), తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సురేఖ(Surekha) లతో కలిసి కోయంబత్తూర్ లోని గంగా హాస్పిటల్ లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ రాజశేఖరన్, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూఎస్ మియామీకి చెందిన మణికట్టు స్పెషలిస్ట్ డాక్టర్ అలెంజాడ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ ల నేతృత్వంలో జూలై 28వ తేదీన శస్త్ర చికిత్స దిగ్విజయంగా పూర్తయింది.
రామ్ చరణ్ కు సర్జరీ సక్సెస్ అవ్వడంతో మెగా అభిమానులు వైద్య బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.సర్జరీ అనంతరం 8 వారాలపాటు రామ్ చరణ్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. సాధారణంగా సర్జరీ తర్వాత ఎవరైనా సరే నేరుగా తమ ఇంటికి వెళ్తారు. కానీ రామ్ చరణ్ , ఉపాసన దంపతులు వెళ్లిన చోటు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. వారిలోని ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా చేస్తోంది..తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్.. వారికి మాత్రమేనండోయ్!
విషయంలోకి వెళ్తే సర్జరీ పూర్తయిన తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు నేరుగా గంగా హాస్పిటల్ నుండి కోయంబత్తూర్ లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్లారు. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు అనంతరం అక్కడ గోశాలలో ఉన్న గోవులకు పళ్ళు ,ఫలహారాలు అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రామ్ చరణ్ భక్తి భావం మరొకసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా రాంచరణ్ ఇక్కడ నలుపు వస్త్రాలలో కనిపించగా.. ఉపాసన సింపుల్ చుడీదార్ లుక్ లో కనిపించారు.
రామ్ చరణ్ విషయానికి వస్తే.. బుచ్చిబాబు దర్శకత్వంలో గత నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 400 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, శివరాజ్ కుమార్ , దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వంలో ఆర్సి 17 టైటిల్ తో సినిమా చేయాల్సింది. ప్రస్తుతం సర్జరీ కారణంగా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్న రామ్ చరణ్ ఆ తర్వాతే సుకుమార్ సినిమా షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు.