Rukmini Vasanth Monthly Income:రుక్మిణి వసంత్ ..ఈ భామ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ అవైటెడ్ హీరోయిన్.అందం,అభినయంతో పాటు న్యాచురల్ యాక్టింగ్ తో కోట్లాదిమంది ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుస పాన్ ఇండియా ఫిలిమ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ఈ కన్నడ కస్తూరి అసలు ఎంత సంపాదిస్తుందో అంటూ ఆరా తీస్తున్నారు మూవీ లవర్స్.మరి రుక్మిణి వసంత్ చేస్తున్న సినిమాల,బ్రాండ్ ప్రమోషన్స్ ఆధారంగా నెలకి ఎంత సంపాదిస్తుందో ఒకసారి చూద్దాం రండి.
రుక్మిణి ఇచ్చిన పర్ఫామెన్స్ టాప్ నాచ్
ముందుగా ఈ అమ్మడు సినిమా కెరీర్ విషయానికి వస్తే 2019లో వచ్చిన బీర్బల్ ట్రయాలజీ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి వసంత్.ఇక ఆ తర్వాత బనారస్ సినిమా చేసినప్పటికీ సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఎ ,మరియు సప్త సాగర దాచే ఎల్లో సైడ్ బి సినిమాలలో రుక్మిణి చేసిన పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ముఖ్యంగా అమాయకపు చూపులతో రుక్మిణి ఇచ్చిన పర్ఫామెన్స్ టాప్ నాచ్.
ఇక ఆ సినిమా తర్వాత రిషబ్ శెట్టితో చేసిన కాంతారావు చాప్టర్ 1 ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం టాక్సిక్ లో కీరోల్ పోషిస్తున్న ఈ భామ డ్రాగన్ లో తారక్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే
ఒక్కో సినిమాకి దాదాపు
ఇక ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఒక్కో సినిమాకి దాదాపు రెండు నుంచి మూడు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రొడక్షన్ హౌస్ ని బట్టి ఇది కాస్త అటు ఇటుగా అవుతుందని తెలుస్తుంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా పాపులర్ అయిన ఈ భామ బ్రాండ్ ఎండార్స్మెంట్ లోను గట్టిగానే సంపాదిస్తుందట. ఇక మార్కెట్లో ఉన్న అంచనా ప్రకారం రుక్మిణి వసంత్ నెలకి 50 నుంచి 70 లక్షల రూపాయలని కేవలం బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారానే సంపాదిస్తుందని సోషల్ మీడియా టాక్. మరి దీనిపై రుక్మిణి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇస్తే కానీ చెప్పలేము.
దాదాపుగా నెలకి ఎంత లేదన్న
ఇలా మొత్తంగా అటు సినిమాలని ఇటు బ్రాండ్ ఎండార్స్మెంట్లని కలుపుకుంటే దాదాపుగా నెలకి ఎంత లేదన్న ఒక కోటి రూపాయలు సంపాదిస్తుందని లెక్క లేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఇక ఒకేసారి రెండు పెద్ద సినిమాలు గనుక చేతిలో ఉంటే ఇది మరింత ఎక్కువ అవకాశం ఉందట కూడా. మొత్తానికి నటనతోను సత్తా చాటుతున్న ఈ భామ ఇప్పుడు సంపాదనలోనూ దూసుకుపోతుందన్నమాట!
also read :పార్ట్-2 ఫీవర్… ‘రాకా’ కూడా అదే దారిలోనా?