E-Paper
Advertisement

నా డ్రీమ్ రోల్ అదే: రేణూ దేశాయ్

నా డ్రీమ్ రోల్ అదే: రేణూ దేశాయ్
Advertisement

Renu Desai:మోడల్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రేణూ దేశాయ్ (Renu Desai). పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో బద్రి, జానీ వంటి సినిమాలు చేసిన ఈమె.. ఆ సినిమా షూటింగ్ల సమయంలోనే పరిచయం ప్రేమగా మారి సహజీవనం చేశారు. వివాహానికి ముందే అఖీరా నందన్ కు జన్మనిచ్చిన ఈ జంట.. వివాహం తర్వాత ఆధ్యకు జన్మనిచ్చారు. అయితే కొన్ని విభేదాల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. ఇక పిల్లల్ని తీసుకొని ముంబైలోనే సెటిలైపోయారు రేణూ దేశాయ్. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సమాజానికి ఉపయోగపడే అంశాలపై స్పందించే ఈమె అటు ఎన్జీవోలు కూడా నడుపుతున్నారు. ఇకపోతే ఇండస్ట్రీకి దూరమైన రేణూ దేశాయ్..’ టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హేమలత లవణం అనే పవర్ఫుల్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించారు.

26 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ..

అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ రేణూ దేశాయ్ మరో సినిమాలో కనిపించలేదు. కానీ ఇప్పుడు దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ తమిళంలో రీఎంట్రీ ఇస్తున్నారుm ఈ సందర్భంగా ఆమె నటించిన తాజా చిత్రం ఓం (OM). సాయి పల్లవి (Sai Pallavi) ఐపీఎస్ ఆఫీసర్ గా తొలిసారి యాక్షన్ పర్ఫామెన్స్ తో ఈ చిత్రంలో అదరగొట్టబోతున్నారు. ధనుష్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ సినిమాలో శ్రీ లీల ఆయనకు భార్యగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రేణూ దేశాయ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తన లుక్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు రేణూ దేశాయ్. నవంబర్ 20న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలలో సందడి చేశారు రేణూ దేశాయ్

నా డ్రీమ్ రోల్ అదే – రేణూ దేశాయ్

Advertisement

అందులో భాగంగానే తన డ్రీమ్ రోల్ గురించి రేణూ దేశాయ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నాకు నెగిటివ్ రోల్ లో చేయాలి అని ఎప్పటినుంచో కోరిక ఉంది. ముఖ్యంగా ఒక కోపిష్టి పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను. కానీ నన్ను చూసిన ఎవరైనా సరే మేడం మీతో అవ్వదు.. మీరు చాలా సాఫ్ట్ గా ఉంటారు అని చెబుతున్నారు. ముఖ్యంగా మీరంతా నన్ను ఒక టైప్ ఆఫ్ కాస్ట్ గా మార్చేస్తున్నారు. రేణు దేశాయ్ అంటే ఒక గృహిణి .. ఒక సోదరి లాంటి పాత్రలకే నన్ను పరిమితం చేస్తున్నారు. దయచేసి నాలోని టాలెంట్ ని గుర్తించండి.

also read: ఘనంగా బిగ్ బాస్ ప్రేరణ సీమంతం వేడుక.. డెలివరీ ఎప్పుడంటే?

దయచేసి నన్ను గుర్తించండి..

Advertisement

నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అప్పుడే కదా దానిని నేను ఛాలెంజ్గా తీసుకొని నాలోని నటనను బయట పెట్టగలుగుతాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలలో పెద్దగా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నట్లు అనిపించడం లేదు. ముఖ్యంగా ఒక సీరియస్ విలన్ రోల్ ఇస్తే.. అప్పుడే కదా నాలో టాలెంట్ ఉందా లేదా అనేది బయటపడుతుంది.” అంటూ తన అభిప్రాయాన్ని బయట పెట్టింది రేణూ దేశాయ్.

Related News

Sobhita Dhulipalla: అక్కినేని కోడలు రేంజే వేరు.. ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

బురదలో ఫైట్.. నీళ్లలో 20 గంటలు.. రష్మిక కష్టాలు మామూలుగా లేవుగా!

అప్పుడు దేశముదురు.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?

వృషకర్మ నుంచి మరో సర్‌ప్రైజ్.. ఈసారి ఎమోషన్స్‌తో టార్గెట్ చేశారుగా !

ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తున్న శర్వా ‘భోగి’.. కొత్త డేట్ ఫిక్స్!

అషు రెడ్డి లుక్స్ కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఏముందిరా బాబూ!

ఆదర్శకుటుంబం సినిమాపై ఆరోపణలు చేసిన నటి!

Big Stories

Advertisement
×