Rashmika Maayasa:సినిమా ఇండస్ట్రీలో ఒక కథను అనుకోవడం వేరు.. ఆ కథను తెరపైకి తీసుకురావడం వేరు. ముఖ్యంగా హీరోయిన్‌ను ప్రధాన పాత్రలో పెట్టి భారీ యాక్షన్ సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. అలాంటి ప్రయత్నంతోనే ఇప్పుడు
రష్మిక మందన్న..నేషనల్ క్రష్ గా క్రేజ్ కొట్టేసిన ఈ భామ తాజాగా ‘మైసా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్దమవుతుంది కూడా.ఈ సందర్భంగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న రవీంద్ర పులి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ముఖ్యంగా ఈ సినిమా కోసం రష్మిక ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చారు.
ఈ సినిమా వెనుక దాదాపు 13 ఏళ్ల కల ఉందని గతంలో ‘అర్ధ శతాబ్దం’ సినిమా చేసినప్పటికీ కరోనా కారణంగా థియేటర్లలో తన సినిమాను చూసుకోవాలనే కల నెరవేరలేదని చెప్పారు. ఇప్పుడు ‘మైసా’తో ఆ కల నిజం కాబోతోందని తన సంతోషాన్ని బయట పెట్టారు.
ఇక రష్మికను హీరోయిన్‌గా అనుకోవడం గురించి చెబుతూ ‘సీతారామం’ సినిమా సమయంలో రష్మికను దగ్గరగా గమనించానని అప్పుడే ఆమెతో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.పైగా రష్మికను దృష్టిలో పెట్టుకునే కథ రాశానని, మరో హీరోయిన్‌ను అసలు అనుకోలేదని స్పష్టం చేశారు.అలా కథ పూర్తయ్యాక రష్మికకు చెప్పడం, ఆమె వెంటనే ఓకే చేయడం జరిగిపోయాయని సినిమా సెట్స్ మీదకి వెళ్ళిన తీరుని వివరించారు.
ఇక ఈ సినిమాలో రష్మిక చేసే యాక్షన్ సీన్స్ మాత్రం మామూలుగా ఉండవని ముఖ్యంగా దాదాపు 120 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలోకి దూకే సీన్ కోసం మొదట డూప్‌ను అనుకున్నామని తెలిపారు. కానీ రష్మిక మాత్రం తానే చేస్తానని ముందుకు రావడంతో చివరకు ఆ సీన్‌ను సింగిల్ షాట్‌లోనే పూర్తి చేశారని షూటింగ్ సంగతులని గుర్తు చేసుకున్నారు.
ఇక బురదలో జరిగే మడ్ ఫైట్ కోసం రష్మిక మూడు రోజుల పాటు కష్టపడ్డారని అండర్ వాటర్ ఫైట్ కోసం కూడా దాదాపు మూడు రోజులు షూటింగ్ చేయగా, ఆమె సుమారు 20 గంటల పాటు నీటిలోనే ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయని, నీటి ఒత్తిడి కారణంగా కొంతకాలం చెవులు కూడా సరిగ్గా వినబడలేదని చెప్పారు. అయినప్పటికీ రష్మిక ఎక్కడా వెనక్కి తగ్గలేదని ఆకాశానికి ఎత్తేశారు.
అయితే సినిమాలో యాక్షన్ ఎంత ముఖ్యమో ఎమోషన్ కూడా అంతే ముఖ్యమని ఇది కేవలం రివెంజ్ కథ మాత్రమే కాదని, తండ్రి కోసం ఒక కూతురు ఎంత దూరం వెళ్లగలదు అనే ఎమోషన్ తో కూడిన కథ అని చెప్పారు. ఇక రష్మిక భర్త విజయ్ దేవరకొండ కూడా టీజర్, పోస్టర్లు, పాటలు చూసి విజయ్ మెచ్చుకున్నారని షూటింగ్‌లో రష్మికకు గాయాలవుతున్నా అలాగే చేయడం చూసి విజయ్ ఆశ్చర్యపోయారని తెలిపారు.
మరోవైపు రష్మిక యాక్షన్ చూస్తుంటే విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’, ‘రౌడీ రాణి’ సినిమాలు గుర్తొస్తాయని ,తనకి భవిష్యత్తులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతో కూడా సినిమాలు చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు రవీంద్ర !
ALSO READ:అప్పుడు దేశముదురు.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?