Sharwanand Bhogi:శర్వానంద్.. చార్మింగ్ స్టార్ గా తెలుగు సినిమాలతో సాలిడ్ క్రేజ్ కొట్టేసిన ఈ వెర్సటైల్ స్టార్ ఇపుడు ఫ్యాన్స్కి మరో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఫుల్ ఊరమాస్ లుక్లో కనిపిస్తూ ‘భోగి’ సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్ చేసేందుకు ఎంట్రీ ఇస్తున్నాడు.మాస్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ ఉందన్న సంగతి తెల్సిందే.
ఇక శర్వా కొత్త లుక్, సినిమా బ్యాక్ డ్రాప్ టీజర్లో చూపించిన యాక్షన్ సీన్లు చూస్తుంటే ఇది ఆయన శర్వా కెరీర్ లో ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పక్కర్లేదు. రఫ్ అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో శర్వా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని ఇప్పటి నుండే కళ్ళు కాసేలా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్.
నిజానికి శర్వా అనగానే మనకు గమ్యం’, ‘ప్రస్థానం’, ‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి.ముఖ్యంగా కథ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా బాగా దగ్గరయ్యాడు. అయితే ‘మహాసముద్రం’, ‘ఒకే ఒక జీవితం’ వంటి వెరైటీ సినిమాలు ఆయన కెరీర్ ని డిసప్పాయింట్ చేశాయి .అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా మళ్ళీ ‘భోగి’ లాంటి సరికొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
ఇక డైరెక్టర్ సంపత్ నంది విషయానికి వస్తే ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’, ‘గౌతమ్ నంద’, ‘సీటీమార్’ లాంటి సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు కూడా.ముఖ్యంగా ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల్లో కమర్షియల్ మీటర్ సాలిడ్ గా డిజైన్ చేశాడనే చెప్పాలి.ఇప్పుడు శర్వాతో చేస్తున్న ‘భోగి’లో మాత్రం పీరియడ్ బ్యాక్డ్రాప్ తీసుకోవడం కాస్త ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.
ఇక ఇప్పటికే రిలీజైన ‘భోగి’ టీజర్ సినిమా మీద అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది. శర్వా కనిపించిన తీరు, బాడీ లాంగ్వేజ్, రఫ్ గెటప్ ఫ్యాన్స్కి పిచ్చ పిచ్చగా నచ్చేశాయి. అలాగే ‘భోగి’ నుంచి వచ్చిన పాటలు కూడా సినిమా మీద క్యూరియాసిటీ పెంచేస్తున్నవే. చూడాలి పాటల్లో కనిపించే బ్యాక్డ్రాప్, మ్యూజిక్, విజువల్స్ ఈ సినిమాకి ఎలాంటి ప్లస్ అవుతాయో చూడాలి.
ఇక గత కొంతకాలంగా సినిమా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. A’ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుందని చెప్పేసింది. చూడాలి మరి ఎన్నాళ్ళగానో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న శర్వాకి భోగి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !
ALSO READ:పదేళ్ల ప్రయాణంలో ఎన్నో కన్నీళ్లు.. మరెన్నో విజయాలు.. దీపిక ఎమోషనల్ జర్నీ!