E-Paper
Advertisement

వృషకర్మ నుంచి మరో సర్‌ప్రైజ్.. ఈసారి ఎమోషన్స్‌తో టార్గెట్ చేశారుగా !

వృషకర్మ నుంచి మరో సర్‌ప్రైజ్.. ఈసారి ఎమోషన్స్‌తో టార్గెట్ చేశారుగా !
Advertisement

Vrushakarma Song:అక్కినేని నాగ చైతన్య..టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ అక్కినేని అందగాడు ఇపుడు మరో సారి వృషకర్మతో ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమైపోయాడు. ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ మిస్టికల్ థ్రిల్లర్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయని తెల్సిందే .

ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.అందులో భాగంగానే ‘ఛలో పదవే’ అనే సెకండ్ సింగిల్ ని వదిలి సినిమాపై అంచనాలు పెంచేసింది. ‘మజిలీ’, ‘లవ్ స్టోరీ’ సినిమాలతో తనదైన ముద్ర వేసిన నాగ చైతన్య, ఇప్పుడు ‘వృషకర్మ’తో మరోసారి ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు.ఇక ‘ఛలో పదవే’ పాటతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పాలి.

Advertisement

ఈ పాటలో నాగ చైతన్య, చిన్నారి కియారా ఖన్నా మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించరు మేకర్స్. ఆటిజం సమస్యతో బాధపడుతున్న చిన్నారి పాత్రలో కియారా ఖన్నా నటిస్తుండగా, ఆమెతో చైతూకి ఉండే బాండింగ్ ఈ పాటలో మెయిన్ ఎసెట్ అని చెప్పకతప్పదు. ముఖ్యంగా కియారాతో నాగ చైతన్య కనిపించిన సీన్స్ కి ఎమోషనల్ అవుతున్నారు ఆడియన్స్ .

ఇక ఈ పాటకు అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ‘వృషకర్మ’కి పని చేయడం సినిమాకి కలిసివచ్చేదే.ఇక అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ లైఫ్ యొక్క వాల్యూస్ ని గుర్తు చేస్తే సాయి విఘ్నేష్ వాయిస్ ఈ పాటకి మరింత బ్యూటిని యాడ్ చేసింది.

Advertisement

ఇక నాగ చైతన్య ‘దూత’ వెబ్ సిరీస్‌తో థ్రిల్లర్ జానర్‌లోనూ తన సత్తా చాటిన సంగతి తెల్సిందే. ఆ సిరీస్‌లో మిస్టరీ, సస్పెన్స్‌తో కూడిన కథలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘విరూపాక్ష’ వంటి సక్సెస్‌ఫుల్ థ్రిల్లర్ అందించిన కార్తీక్ దండు దర్శకత్వంలో నటిస్తుండటంతో ‘వృషకర్మ’పై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తుండటం ఇక్కడ విశేషం. చూడాలి మరి 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున ఈ సినిమా చైతుకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !

Tags

Related News

బురదలో ఫైట్.. నీళ్లలో 20 గంటలు.. రష్మిక కష్టాలు మామూలుగా లేవుగా!

అప్పుడు దేశముదురు.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?

ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తున్న శర్వా ‘భోగి’.. కొత్త డేట్ ఫిక్స్!

అషు రెడ్డి లుక్స్ కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఏముందిరా బాబూ!

ఆదర్శకుటుంబం సినిమాపై ఆరోపణలు చేసిన నటి!

‘బట్టల రామస్వామి’ హీరో ఇప్పుడు ‘రాజిగాడు’.. అల్తాఫ్ హసన్ మరో డిఫరెంట్ అటెంప్ట్!

పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలలో రష్మిక సందడి!

Big Stories

Advertisement
×