E-Paper
Advertisement

అప్పుడు దేశముదురు.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?

అప్పుడు దేశముదురు.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?
Advertisement

Hansika Motwani:టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన హన్సిక మోత్వానీ గత కొంతకాలంగా స్పీడ్ తగ్గించింది.అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా తగ్గకుండా వరుస అప్ డేట్స్ తో అభిమానులని అలరిస్తూనే ఉంది.ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో హన్సిక చాలా సింపుల్‌గా కనిపిస్తూ అందరినీ తన వైపుకి తిప్పేసుకుంది. అందునా ఎలాంటి హడావుడి లేకుండా ట్రెడిషనల్ టచ్ ఉన్న వైట్ కలర్ డ్రెస్సులో, రంగురంగుల శాలువా కప్పుకుని ఫాలోవర్స్ ని ఫిదా చేసేసింది. చేతికి ఒక సింపుల్ వాచ్, చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని తన లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి.

Advertisement

సాధారణంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారంటే అందులో గ్లామర్, హెవీ మేకప్, మోడ్రన్ డ్రెస్సులు ఎక్కువగా కనిపిస్తుంటాయని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కానీ హన్సిక మాత్రం అప్పుడప్పుడు సింపుల్ ఫోటోలతోనూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటుంది.ఇక తెరపై ఎంతో గ్లామరస్‌గా కనిపించే ఈ బ్యూటీ, రియల్ లైఫ్ లో చాలా న్యాచురల్ గా కనిపించడంతో మురిసిపోతున్నారు అభిమానులు.

ఇక హన్సిక సినిమాల విషయానికి వస్తే.. చిన్నప్పుడే బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్‌లో నటించిన ఆమె, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ భామ ఆ తర్వాత రామ్ పోతినేనితో చేసిన ‘కందిరీగ’, ‘మస్కా’ సినిమాలతో పాటు మంచు విష్ణుతో చేసిన ‘దేనికైనా రెడీ’, రవితేజతో నటించిన ‘పవర్’ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.

Advertisement

ముఖ్యంగా ‘కందిరీగ’ సినిమాలో హన్సిక రోల్ యూత్ కి బాగా కనెక్ట్ అయింది.ఇక తెలుగులోనే కాకుండా తమిళంలోనూ హన్సిక తన సత్తా చాటింది. అక్కడ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఒక సాలిడ్మార్కెట్ క్రియేట్ చేసుకుంది.

ముఖ్యంగా. ‘వేలాయుధం’, ‘ఒరు కల్ ఒరు కన్నాడి’, ‘సింగం 2’, ‘అరణ్మనై’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తమిళ తంబీలకు కూడా ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.ఇక కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ఇంపార్టెన్స్ ఉన్న ‘మహా’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించడం విశేషం.

మొత్తంగా ఓవైపు సినిమాలతో అలరిస్తూనే, మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది ఈ అందాల భామ.ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

బురదలో ఫైట్.. నీళ్లలో 20 గంటలు.. రష్మిక కష్టాలు మామూలుగా లేవుగా!

వృషకర్మ నుంచి మరో సర్‌ప్రైజ్.. ఈసారి ఎమోషన్స్‌తో టార్గెట్ చేశారుగా !

ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తున్న శర్వా ‘భోగి’.. కొత్త డేట్ ఫిక్స్!

అషు రెడ్డి లుక్స్ కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఏముందిరా బాబూ!

ఆదర్శకుటుంబం సినిమాపై ఆరోపణలు చేసిన నటి!

‘బట్టల రామస్వామి’ హీరో ఇప్పుడు ‘రాజిగాడు’.. అల్తాఫ్ హసన్ మరో డిఫరెంట్ అటెంప్ట్!

పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలలో రష్మిక సందడి!

Big Stories

Advertisement
×