Sobhita Dhulipalla: ఈ మధ్యకాలంలో హీరోయిన్లు సినిమాలు కన్నా కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నారు.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సైతం సందడి చేస్తూ తమ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తమ ఫోటోలను అలాగే సినిమాల గురించి చెప్తూ అభిమానులకు కనెక్ట్ అవుతూ వస్తున్నారు. అలాంటి వారిలో అక్కినేని కోడలు శోభిత దూళిపాల ఒకరు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ అమ్మడు అక్కినేని కోడలుగా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేసిన సందర్భాలు కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వార్తాగా సినిమాలు చేసి భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ట్రెండీ వేర్లో ఎప్పుడూ దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ నెలకు ఎంత సంపాదిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆమె నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వస్తున్న శోభిత దూళిపాల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అలాగే తన వీడియోలను కూడా షేర్ చేస్తూ అభిమానులని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల కాలంలో నాగచైతన్య అభిమానులు కూడా శోభితను ఫాలో అవుతూ ఆమె ఫోటోలకు లైక్లు కొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి రోజు కూడా తన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయన్న విషయం తెలుసు. మరి ఎప్పుడు లేటెస్ట్ ఫోటోలతో సందడి చేస్తున్న శోభిత సోషల్ మీడియా ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి శోభిత నెలకు ఎన్ని లక్షల రూపాయలు సంపాదిస్తుంది అంటే దాదాపు 20 లక్షలకు పైగానే ఆమె సోషల్ మీడియా ద్వారా అందుకుంటుంది అని ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ వార్తలో నిజం ఎంత ఉందో అన్నది తెలియలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే ప్రచారంలో ఉంది. మరి నిజంగానే సోషల్ మీడియా ద్వారా ఆమె అన్ని లక్షల సంపాదిస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే ఆమె రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ధూళిపాళను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. ధూళిపాళ ముంబైలో పెరిగిన కానీ తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎప్పుడూ చీరకట్టులోనే కనిపిస్తూ ఉంటుంది.. కానీ కొన్నిసార్లు మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తుంది. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. మొన్నటివరకు పద్ధతికి చీర కట్టారే అన్నట్లు ఉన్న ఈమెకు ఇప్పుడు ట్రోల్స్ ఎదురవుతున్నాయి. అంతేకాదు శోభిత పేరు వినగానే బోల్డ్ సినిమాలో ఎక్కువగా గుర్తుకు రావడంతో నాగచైతన్య అభిమానులతో పాటుగా, అటు నాగార్జున అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఎంతో పద్ధతిగా కనిపించే సమంతని వదిలేసి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా నాగచైతన్య అంటూ ఇప్పటికీ కామెంట్లు వినిపిస్తున్న సందర్భాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.. మరి నాగచైతన్య అలాగే శోభిత కలిసి ఒక సినిమా చేస్తారేమో అని అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read :భక్తుడుగా మారిపోయిన బాలు.. సడెన్గా ఇదేం ట్విస్ట్..