E-Paper
Advertisement

అల్లు అరవింద్ చేతుల్లోకి వైజయంతి మూవీస్.. అశ్వినీ దత్ క్లారిటీ!

అల్లు అరవింద్ చేతుల్లోకి వైజయంతి మూవీస్.. అశ్వినీ దత్ క్లారిటీ!
Advertisement

Aswini Dutt: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న వైజయంతి మూవీస్ బ్యానర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. దివంగత సీనియర్ నటులు ఎన్టీఆర్ ను మొదలుకొని చిరంజీవి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒకానొక సమయంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పనైపోయింది.. ఇక క్లోజ్ అయిపోయింది అంటూ వస్తున్న వార్తలకు కల్కి మూవీ చెక్ పెట్టింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898AD చిత్రంతో ఏకంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని మళ్లీ పుంజుకుంది వైజయంతి మూవీస్ బ్యానర్.

అల్లు అరవింద్ చేతుల్లోకి వైజయంతి మూవీస్ బ్యానర్..

అలాంటి ఈ సంస్థను ఇప్పుడు అల్లు అరవింద్ చేతుల్లో పెడుతున్నట్లు ప్రముఖ నిర్మాత వైజయంతి బ్యానర్ అధినేత అశ్వినీ దత్ (Ashwini dutt) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలేం జరుగుతోంది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆకాశంలో ఒక తార సక్సెస్ వేడుకల్లో అశ్వినీ దత్ కామెంట్స్..

Advertisement

గీత ఆర్ట్స్, స్వప్న సినిమాస్ కాంబినేషన్లో నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ప్రధాన పాత్రలో.. సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమౌతూ వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇందులో శృతిహాసన్ తో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) లాంటి భారీ తారాగణం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే మొదటి షో తోనే పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను మొదలుపెట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే సక్సెస్ వేడుక నిర్వహించగా అశ్విని దత్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

కూతురితోపాటు నిర్మాణ సంస్థ బాధ్యతలను అప్పగిస్తూ..

అశ్వినీ దత్ మాట్లాడుతూ.. “అల్లు అరవింద్ పై నాకున్న నమ్మకం మాటల్లో చెప్పలేనిది. అందుకే నా కుమార్తె స్వప్న దత్ ను అల్లు అరవింద్ కు అప్పగిస్తున్నాను. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ బాధ్యతలను కూడా అల్లు అరవింద్ చూసుకోవాలని వేడుకుంటున్నాను అంటూ అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక స్వప్న దత్, అల్లు అరవింద్ మధ్య నిర్మాణ బాధ్యతలపై ఆసక్తికర చర్చకు ఈ వ్యాఖ్యలు తెరలేపాయని చెప్పాలి. ఏది ఏమైనా అల్లు అరవింద్ పై ఉన్న అపారమైన నమ్మకంతో అశ్వినీ దత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

also read: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!

అల్లు అరవింద్ ఈ బాధ్యతలను స్వీకరిస్తారా?

అటు అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ విషయానికొస్తే ఈ సంస్థ కూడా టాలీవుడ్ లో మరో పేరు మోసిన సంస్థ అని చెప్పవచ్చు. నిర్మాత అల్లు అరవింద్ ఈ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ ఫీల్ గుడ్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. స్టార్ హీరోల చిత్రాలను నిర్మించడమే కాకుండా కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ మరింత పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి మొత్తానికైతే అశ్వినీ దత్ ఇచ్చిన ఈ బాధ్యతలను అల్లు అరవింద్ స్వీకరిస్తారా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Related News

నా డ్రీమ్ రోల్ అదే: రేణూ దేశాయ్

Sobhita Dhulipalla: అక్కినేని కోడలు రేంజే వేరు.. ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

బురదలో ఫైట్.. నీళ్లలో 20 గంటలు.. రష్మిక కష్టాలు మామూలుగా లేవుగా!

అప్పుడు దేశముదురు.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?

వృషకర్మ నుంచి మరో సర్‌ప్రైజ్.. ఈసారి ఎమోషన్స్‌తో టార్గెట్ చేశారుగా !

ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తున్న శర్వా ‘భోగి’.. కొత్త డేట్ ఫిక్స్!

అషు రెడ్డి లుక్స్ కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఏముందిరా బాబూ!

Big Stories

Advertisement
×