Tollywood HIT Combo Repeat: సాధారణంగా ఏ సినిమాలోనైనా సరే ఒక కాంబో మంచి విజయం అందుకుంది అంటే.. మళ్ళీ తదుపరి చిత్రాలకు అదే కాంబో రిపీట్ చేయాలని చూస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. అది హీరో – హీరోయిన్ అయినా.. లేదా హీరో – డైరెక్టర్ అయినా.. డైరెక్టర్ – నిర్మాత అయినా.. ఏదైనా సరే ఒక కాంబో మంచి విజయాన్ని అందించింది అంటే.. మళ్ళీ ఆ కాంబో రిపీట్ అవ్వడానికి సమయం పట్టదు.
కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల కొన్ని కొన్ని కాంబినేషన్లు మళ్లీ సెట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాల సమయం కూడా పడుతుంది. ఈ క్రమంలోనే సరిగ్గా 18 ఏళ్ల క్రితం అంటే 2008లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కొత్త బంగారులోకం’. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ సందేశ్ (Varun sandesh), శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
“ఎక్కడా.. ” అనే డైలాగుతో కుర్రకారు హృదయాలను దోచుకున్న శ్వేతా బసు ప్రసాద్.. ఇందులో అందంతో, అద్భుతమైన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానుల హృదయాలను దోచుకుంది. అంతేకాదు ఈ పాత్రతో ఆమె ఏదో మాయ చేసిందని చెప్పాలి. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ అదేది జరగలేదు. అయితే ఈ సక్సెస్ఫుల్ జోడి మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రిపీట్ కానుంది అనే వార్త యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ జోడి మళ్లీ రిపీట్ కానుంది అనే పోస్ట్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
అంతేకాదు ఈ సినిమాతో శ్వేతా బసు ప్రసాద్ టాలీవుడ్ కి మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అంజనలు మరింత పెరిగిపోయాయి.. ఇకపోతే శ్వేతా బసు ప్రసాద్ చివరిసారిగా 2017 లో మిక్చర్ పొట్లం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 2022లో ఇండియా లాక్ డౌన్ చిత్రం లో నటించిన ఈమె.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు సరిగా నాలుగేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలుకరించనుంది.
ALSO READ: ఢీ’ షో వచ్చాకే మార్పు మొదలైందా.. ఉదయభాను షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్!
వరుణ్ సందేశ్ తో కలిసి శ్వేతా బసు ప్రసాద్ చేస్తున్న ఈ రీ ఎంట్రీ మూవీ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా వీరిద్దరి కాంబినేషన్ ఉండబోతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ఈ చర్చకు తగ్గట్టుగానే కొత్త బంగారులోకం సినిమాలో తన అద్భుతమైన నటనతో మాయ చేసిన శ్వేతా బసు ప్రసాద్.. మళ్లీ 18 ఏళ్ల తర్వాత ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.