Karthikeya: అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఎక్స్ 100 (RX100) సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు కార్తికేయ (Karthikeya). ఇలా మొదటి సినిమాతోనే అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈయన తదుపరి టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోగా నటించారు. ఇలా కార్తికేయ నటించిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) హీరోగా నటించిన వాలిమై అని సినిమాలో విలన్ పాత్రలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో నటించినప్పటికీ కూడా ఈయనకు పెద్దగా ఇండస్ట్రీలు అవకాశాలు రాలేదని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాని నేపథ్యంలో కార్తికేయ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అవకాశాలు లేకపోవడంతో కార్తికేయ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారని తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ (Nagarjuna Group of schools)డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కార్తికేయ తండ్రి విట్టల్ రెడ్డి నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పేరుమీద విద్యాసంస్థలను నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విద్యాసంస్థలకు డైరెక్టర్ గా కార్తికేయ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. ఇలా ఈయన విద్యాసంస్థలకు డైరెక్టర్ కావడంతో ఇకపై సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటారని అందరూ భావిస్తున్నారు. కార్తికేయ తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కానీ ఈయనకు మాత్రం సరైన సక్సెస్ లేకపోవడంతోనే తదుపరి అవకాశాలు రాలేదని తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు రాని నేపథ్యంలోనే తన తండ్రి బాధ్యతలను కార్తికేయ తీసుకున్నారు.
Actor Karthikeya Reddy – Director of Nagarjuna Group of Schools. pic.twitter.com/IXHXlWHpb8
— ibomma Ravi (@ibomma_Ravi) September 20, 2026
కార్తికేయ తరహాలోనే ఇప్పటికే ఎంతోమంది యంగ్ హీరోలు అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమై పలు వ్యాపార రంగాలలో కొనసాగుతూ ఉన్నారు. ఇక కార్తికేయ కూడా విద్యాసంస్థల బాధ్యతలను తీసుకున్నారు. తదుపరి ఈయనకు ఏదైనా సినిమాలలో అవకాశాలు వస్తే తిరిగి నటిస్తారా లేదంటే పూర్తిగా తన విద్యాసంస్థల బాధ్యతలతో ముందుకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక కార్తికేయ నటించిన సినిమాల విషయానికి వస్తే..హిప్పీ ,గుణ 369 ,90 ML ,చావు కబురు చల్లగా ,రాజా విక్రమార్క, వాలిమై,బెదురులంక,భజే వాయు వేగం వంటి సినిమాలలో హీరోగా నటించారు.
Also Read: యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. బిగుస్తున్న ఉచ్చు!