E-Paper
Advertisement

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ ‘రాకా’!

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ ‘రాకా’!
Advertisement

Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం” రాకా”(Raaka). అత్యంత భారీ బడ్జెట్, భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన విజువల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

గిన్నిస్ బుక్ లో రాకా..

ఇకపోతే తాజాగా రాకా సినిమా మరొక రికార్డును సాధించింది. ఈ సినిమా ఏకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (guinness world record)లో చోటు సంపాదించుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉంటుంది అయితే రాకా సినిమా కూడా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన టెక్నాలజీతో సరికొత్త బౌండరీలను బ్రేక్ చేస్తూ ఈ సినిమాలో ఏకంగా 37 మంది పర్ఫామెర్లను ఏకకాలంలో మోషన్ క్యాప్చర్ చేస్తూ ఈ సినిమా సంచలన రికార్డును నెలకొల్పింది..

37 మంది పర్ఫామెన్స్ లు..

Advertisement

ఇలా 37 మంది పర్ఫామెన్స్ లను లైవ్ మోషన్ క్యాప్చర్ ద్వారా బంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చోటు సంపాదించుకుంది. ఈ సినిమా గిన్నిస్ బుక్ లో చోటు తగ్గించుకుంది అంటేనే సినిమా కోసం చిత్ర నిర్మాతలు నటీనటులు ఏ స్థాయిలో కష్టపడుతున్నారో స్పష్టం అవుతుంది. ఇలా ఈ సినిమా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధుల నుంచి నటుడు అల్లు అర్జున్(Allu Arjun) అట్లీ(Atlee) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాకా పై పెరిగిన అంచనాలు..

ఇక ఈ ఫోటో చూసిన బన్నీ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఇలాంటి అద్భుతమైన రికార్డులను నెలకొల్పుతున్న నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాకుండా గ్లోబల్ మాస్టర్ పీస్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ సినిమా విడుదల కాకుండా ఇలాంటి రికార్డులు నెలకొల్పడంతో ముందు ముందు ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన బన్నీ రాకాతో ఆ రికార్డులను చెరిపేయబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: రూ.46 కోట్లు మోసం… పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన హీరోయిన్ రాధ!

Related News

రూ.46 కోట్లు మోసం… పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన హీరోయిన్ రాధ!

టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో .. ఇప్పుడేం చేస్తున్నారంటే?

‘ది ప్యారడైజ్’ మూవీకి సెన్సార్ షాక్.. మరీ ఇంత వయలెన్స్?

18 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. శ్వేత ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

8గంటలు నీళ్లలోనే.. చెప్పుల్లేకుండా పర్వతోరహణ.. ‘మైసా’ వెనుక రష్మిక కష్టాలు!

ఆధార్ కార్డ్ చూపించి మరీ రియల్ ఏజ్ చెప్పేసిన వైష్ణవి చైతన్య!

“నేను బ్రతికే ఉన్నాను”.. సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి వడివుక్కరశి ఆవేదన!

Big Stories

Advertisement
×