The paradise Pre Release: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా చిత్ర బృందం హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. అయితే చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉన్నారు.
శిల్పకళ వేదికలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నాని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు నాని ఆడిటోరియంలోకి అడుగుపెట్టక ముందే సుమ (Suma)బయటకు వెళ్లి నానికి దిష్టి తీయడం సంచలనగా మారింది. ఈ సినిమాలో ఇరుగు దిష్టి పురుగు దిష్టి నల్ల గుడ్డలోడి దిష్టి అంటూ వచ్చే డైలాగ్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే సుమ కూడా నానికి దిష్టి తీయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
నానిను నిలబెట్టి సుమ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పైరసీ దిష్టి, పోస్ట్ పోన్ల దిష్టి క్యాన్సిలేషన్ల దిష్టి, కాంట్రవర్సీల దిష్టి, సెట్ లో యాక్సిడెంట్ల దిష్టి నెట్టులో నెగిటివిటీల దిష్టి 2026 లో థియేటర్లు కళకళ,బాక్సాఫీస్ గలగల దిష్టి మొత్తం పోవాలి అంటూ సుమ నానికి దిష్టి తీసి తనని లోపలికి పంపించారు. ఇలా యాంకర్ గా ఒక హీరోకి దిష్టి తీయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నాని సినీ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నాని ఈ సినిమాలో జడల్ జమాన్ అనే పాత్రలో రెండు జడలతో విభిన్నమైన మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని తల్లి పాత్రలో బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి నటించి సందడి చేయగా నాని జోడిగా ఖయాదు లోహర్(Kayadu Lohar) సుబ్బు పాత్రలో హీరోయిన్గా సందడి చేయబోతున్నారు. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. సంపూర్ణేష్ బాబు కీర్తి సురేష్ రాఘవ వంటి వారు ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా 24వ తేదీ విడుదల అయ్యి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ ‘రాకా’!