E-Paper
Advertisement

మనల్ని ఎవరు ఆపలేరు…థియేటర్లు తగలబడి పోవాల్సిందే..నాని స్పీచ్ వైరల్!

మనల్ని ఎవరు ఆపలేరు…థియేటర్లు తగలబడి పోవాల్సిందే..నాని స్పీచ్ వైరల్!
Advertisement

The Paradise Pre Release: నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ది ప్యారడైజ్( The Paradise). ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే 23వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఈ సినిమా విడుదలకు రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు.

శ్రీకాంత్ నా సోదరుడు…

ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నాని (Nani) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని మేము ఒక సినిమా లాగా చేయలేదని చాలా ఫ్యాషన్ తో చేసామని తెలిపారు. ఈ సినిమా కోసం టెక్నీషియన్ల నుంచి మొదలుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ప్రాణం పెట్టి పనిచేశారని మా అందరి కష్టం 23వ తేదీ మీరు థియేటర్లలో చూస్తారని తెలిపారు. ఇక డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తనకు మంచి అనుబంధం ఉందని తను నా సొంత తమ్ముడు లాగేనని తెలిపారు. అలాగే మోహన్ బాబు, అనిరుద్, ఖయాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి నాని మాట్లాడుతూ వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

థియేటర్లు తగలబడి పోవాల్సిందే …

Advertisement

ఇక అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్యారడైజ్ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే మీరు జడల్ గాడితో లాక్ అయిపోతారని ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంటర్టైన్ అవుతారని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా థియేటర్లలో వైల్డ్ ఫైర్ అవుతుంది, థియేటర్లు మొత్తం తగలబడిపోతాయని నాని తెలిపారు. సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి నుంచి సెలబ్రేషన్స్ మొదలవుతాయని నాని తెలియజేశారు. ఇకపోతే సినిమా గురించి కొంతమంది ఇప్పటికే నెగిటివీటిని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే .ఈ అంశం గురించి కూడా నాని మాట్లాడారు.

నెగిటివిటీని పట్టించుకోవద్దు..

మనం సక్సెస్ అవుతున్నాము అంటే అభినందించే వారితో పాటు, విమర్శించే వారి సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. అలాగే మన సినిమాకి ఎలాంటి నెగెటివిటీని తీసుకువచ్చిన మీరు మాత్రం పాజిటివిటీ వైపు పరుగులు తీయాలని చివరికి మీరు చూపిస్తున్న పాజిటివిటీకి నెగిటివిటీ కూడా మారిపోవాలి అంటూ సినిమా గురించి నెగిటివ్ ప్రచారాన్ని ఇప్పుడే నాని ఖండించారు. మా రెండేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం మరొక రెండు రోజులలో మీకు తెలుస్తుందని కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని, మనల్ని ఎవరు ఆపలేరు అంటూ నాని ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి 24వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా నాని కెరియర్ కు ఇలాంటి సక్సెస్ అందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: నాని సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన టికెట్ ధరలు!

Related News

నాని సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన టికెట్ ధరలు!

నాని గ్రాండ్ ఎంట్రీ… దిష్టి తీసిన యాంకర్ సుమ!

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ ‘రాకా’!

రూ.46 కోట్లు మోసం… పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన హీరోయిన్ రాధ!

టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో .. ఇప్పుడేం చేస్తున్నారంటే?

‘ది ప్యారడైజ్’ మూవీకి సెన్సార్ షాక్.. మరీ ఇంత వయలెన్స్?

18 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. శ్వేత ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

Big Stories

Advertisement
×