Actress Radha: సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అలనాటి తారలు రాధా (Radha)అంబిక(Ambika) వంటి వారు ఒకరు. వీరిద్దరూ అక్కచెల్లెళ్లు అనే సంగతి అందరికీ తెలిసిందే. వీరు 80 లలో సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. ఇలా హీరోయిన్లుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ అక్క చెల్లెల మధ్య ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగిందని తెలుస్తోంది. తాజాగా 46 కోట్ల రూపాయల డబ్బు విషయంలో రాధ తన అక్క అంబికా గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.
తాజాగా నటి రాధికా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తన అక్క అంబికతో పాటు తమ్ముడు మల్లికార్జున్ కుంజన్ నాయర్ (Mallikarjun kunjan nair) పై కూడా ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులు భాగంగా రాదా తన తోబుట్టువులు పథకం ప్రకారమే తనని మోసం చేశారని తెలియజేశారు. గతంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించి తాను కొన్ని కాళీ చెక్కులపై సంతకాలు చేసి ఉంచానని రాధా ఫిర్యాదుల పేర్కొన్నారు. గత ఏడాది కొన్ని వ్యాపార సంస్థలకు పేరు మార్చడంతో బ్యాంకు నుంచి కొత్త చెక్ బుక్ తీసుకున్నాను. ఈ నేపథ్యంలోనే పాత చెక్ బుక్ వాడటం పూర్తిగా నిలిపివేశానని ఈమె ఫిర్యాదులు తెలిపారు.
ఇలా పాత చెక్ బుక్కులను వాడటం లేదనే విషయం తెలిసిన తన తోబుట్టువులు అంబికా, మల్లికార్జున్ ఇద్దరు కలిసి తనుకు తెలియకుండా పాత చెక్ బుక్ లోని ఐదు చెక్కులను దొంగలించారని, ఇలా దొంగలించిన చెక్కులపై 46 కోట్ల భారీ మొత్తాన్ని తన అక్క అంబికా పేరు మీద రాసి బ్యాంకులో డ్రా చేసుకున్నారని తెలిపారు. ఈ విషయం నాకు తెలియకుండా జరిగింది. అయితే గత నెల 17వ తేదీ బ్యాంక్ అధికారులు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియడంతో తన అక్క చేసిన మోసం మొత్తం బయటపడిందని రాధా పోలీసులకు తెలియజేశారు.
ఈ విధంగా తనకు తెలియకుండా 46 కోట్ల రూపాయలు దొంగలించినందుకు తన అక్క తమ్ముడిపై ఈమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరి ఈ వివాదం పై నటి అంబికా స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇలా డబ్బు విషయంలో ఈ అక్క చెల్లెలు ఇద్దరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఈ వ్యవహారం కాస్త సౌత్ సినీ ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది. మరి ఈ విషయంపై అంబిక స్పందన ఏంటి అనేది తెలియాల్సింది. ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇక రాదా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినప్పటికీ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో జడ్జిగా పాల్గొంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో .. ఇప్పుడేం చేస్తున్నారంటే?