The paradise Movie: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్( The Paradise). ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో 23వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ల రేట్లు పెంచమని కోరుతూ చిత్రబృందం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం పారడైజ్ సినిమాకు టికెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు పది రోజులపాటు పెంచిన ధరలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఇక తెలంగాణలో ప్రీమియర్లకు 500 రూపాయలు చొప్పున టికెట్ ధరలను నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం (A.P.Government) కూడా తాజాగా ఈ సినిమాకు టికెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు . మరి ఏపీలో పెరిగిన ధరలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే..
ఈ సినిమా 24వ తేదీ విడుదలవుతుండగా 23వ తేదీ ఏపీలో కూడా ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి అయితే ప్రీమియర్లకు ఈ సినిమా టికెట్ ధర జీఎస్టీ లతో కలిపి మల్టీప్లెక్స్ లలో 400 రూపాయలు చొప్పున నిర్ణయించింది. అదేవిధంగా సింగిల్ స్క్రీన్ తీయేటర్లలో 300 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లలో 75 రూపాయలు జీఎస్టీలతో కలిపి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకు ఐదు షోలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇక అక్టోబర్ 4వ తేదీ నుంచి పెంచిన ధరలు అందుబాటులో ఉండవని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు టికెట్ ధరలను పెంచడానికి అనుమతి లభించడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నాని సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాని ఖయాదులోహర్ జంటగా నటించగా కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు. సీనియర్ నటీనటులు సోనాలికులకర్ణి, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.