E-Paper
Advertisement

ప్లేబాయ్‌కి బుద్ధి చెప్పబోయి ప్రేమలోనే పడితే… ఓటీటీలో దుమ్మురేపుతున్న రోమ్‌కామ్

ప్లేబాయ్‌కి బుద్ధి చెప్పబోయి ప్రేమలోనే పడితే… ఓటీటీలో దుమ్మురేపుతున్న రోమ్‌కామ్
Advertisement

Tamil Romantic Comedy: నేటితరం యూత్ టేస్ట్ కి తగ్గట్టుగా బోల్డ్ రొమాన్స్, ఫన్నీ ఇగో క్లాషెస్, మోడరన్ రిలేషన్‌షిప్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో అన్‌లిమిటెడ్ రెస్పాన్స్ వస్తోంది. అలాంటి ఒక క్రేజీ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సరికొత్త తమిళ వెబ్ సిరీస్ ‘మస్ట్ డేట్ ది ప్లే బాయ్’ (Must Date The Play Boy). ఒక ప్లేబాయ్‌ను దూరంగా ఉంచేందుకు మొదలైన ఫేక్ రిలేషన్‌షిప్‌ చివరకు నిజమైన ప్రేమగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయనే పాయింట్‌తో కథ సాగుతుంది. ఈ రోజు నుంచే ఇది ఓటీటీలోకి వచ్చింది. వీకెండ్ లో ఒక మంచి కలర్‌ఫుల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథేంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

తారా (నాగదుర్గ) చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టే, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండే అమ్మాయి. మరోవైపు జైన్ (ముజమ్మిల్ ఎలియాస్) క్యాంపస్‌లో అమ్మాయిలతో సులభంగా పరిచయాలు పెంచుకుంటూ, ఒకరి తర్వాత మరొకరితో డేటింగ్ చేసే ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకుంటాడు. అతని చూపు తన బెస్ట్ ఫ్రెండ్ కౌషి (గంగా కన్నన్)పై పడటంతో తారా ఆందోళన చెందుతుంది. జైన్ కారణంగా తన స్నేహితురాలు బాధపడకూడదని భావించి, అతన్ని కౌషికి దూరంగా ఉంచేందుకు ఓ ప్లాన్ వేస్తుంది.

Advertisement

అందులో భాగంగా జైన్‌కు తానే గర్ల్‌ఫ్రెండ్‌గా నటిస్తానని చెప్పి అతనితో ఫేక్ రిలేషన్‌షిప్ మొదలుపెడుతుంది. జైన్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తాడు. అయితే అతనికీ తనదైన ఓ రహస్య ఉద్దేశం ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు నటిస్తూ క్యాంపస్‌లో తిరగడం మొదలుపెడతారు. మొదట అంతా ఒక ఆటలా కనిపించినా, రోజులు గడిచేకొద్దీ ఇద్దరి మధ్య నిజమైన అనుబంధం ఏర్పడుతుంది. ఒకరిపై ఒకరికి తెలియకుండానే ఇష్టం పెరుగుతుంది.

అయితే ఈ ఫేక్ రిలేషన్‌షిప్‌ను ఎంతకాలం కొనసాగించగలరు? జైన్ అసలు ఉద్దేశం ఏంటి? తారా తన స్నేహితురాలిని కాపాడే ప్రయత్నంలో తానే ప్రేమలో చిక్కుకుందా? అనే అంశాలతో కథలో ఫన్, రొమాన్స్, ఎమోషన్స్ కలగలిసిపోతాయి. ఫేక్ డేటింగ్, ఫ్రెండ్‌షిప్, యూత్ రిలేషన్‌షిప్స్ ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి టైమ్‌పాస్‌గా నిలుస్తుంది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

Advertisement

ఈ సిరీస్‌లో నాగదుర్గ, ముజమ్మిల్ ఎలియాస్ లీడ్ రోల్స్ లో నటించారు. వీరితో పాటు మజైమేఘన్, గంగా కన్నన్, ప్రగదేశ్ ప్రకాష్, పురవలన్ నారాయణసామి, శరవణన్ గౌతమ్, మీరా సుబ్రమణ్యం, ఆర్. చంద్రన్, జేనాని చడగోబన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. టి. సూరియవేలన్ దర్శకత్వం వహించడంతో పాటు హరి రాజన్‌తో కలిసి స్క్రీన్‌ప్లే అందించారు. ఇమ్మా డెలోస్ శాంటోస్ రాసిన అదే పేరుతో ఉన్న వెబ్ నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. 360 ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ తమిళ సిరీస్ 2026 నవంబర్ 13 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ప్రస్తుతం తమిళ ఒరిజినల్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Read Also: లక్కీ డ్రా పేరుతో ఫ్రాన్స్ ట్రిప్… అక్కడికి వెళ్ళిన ఏడుగురు మహిళలకు మతిపోగొట్టే షాక్… ఇదేం పరేషాన్ రా అయ్యా

Tags

Related News

భార్యపై దారుణ దాడి.. దొంగల పేరుతో భర్త డ్రామా.. ఈ క్రైమ్ కథలో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా!

20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్

గడ్డకట్టిన సరస్సులో స్టూడెంట్ శవం.. హంతకుడి వేటలో కవల సోదరి.. ఓటీటీలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ

40 ఏళ్ల బ్యాచిలర్ ఇంట్లోకి అందమైన యువతి ఎంట్రీ.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘పరివారిక్ మనోరంజన్’!

దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు

నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు… ప్రతి క్షణం ఉత్కంఠ.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తెరవెనుక గ్లామర్ తారల చీకటి దందాలు… ఓ హీరోయిన్ సూసైడ్ వెనుక ఇంత పెద్ద మాఫియా కథా?

Big Stories

Advertisement
×