Meenakshi Chaudary : మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులలో నటించే అవకాశాన్ని అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. మీనాక్షి చౌదరి గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనగనగా ఒక రాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల రావడానికి మీనమ్మ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈమె అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో కలిసి వృషకర్మ (Vrushakarma)అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary)నటుడు నాగచైతన్య అలాగే వెంకటేష్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి గురించి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ వెంకటేష్(venkatesh) గారు నాగచైతన్య ఇద్దరు కాస్త రిజర్వ్డ్ గానే ఉంటారు. వెంకటేష్ గారితో పోలిస్తే నాగచైతన్య మరికాస్త సైలెంట్ గా ఉంటారు. వీరిద్దరూ ఎవరి గురించి పెద్దగా పట్టించుకోరు, వారి పని వాళ్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు.
ఇలా వీరిద్దరిలో చాలా విషయాలు ఒకే విధంగా ఉంటాయని మీనాక్షి చౌదరి తెలిపారు. వెంకటేష్ గారు సైలెంట్ గా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుతుంటారు కానీ నాగచైతన్య మాత్రం చాలా సైలెంట్ గానే ఉంటారని మీనాక్షి చౌదరి తెలిపారు. బహుశా నాగచైతన్య మాదిరిగానే అందరూ సైలెంట్ గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మన ఎనర్జీ పూర్తిగా సేవ్ అవుతుంది కదా అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా మామ అల్లుళ్లు ఇద్దరు ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉన్నారంటూ ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి కామెంట్స్ చేశారు.
ఇక మీనాక్షి చౌదరి నాగచైతన్యతో కలిసి వృషకర్మ అనే సినిమాల్లో నటించగా, వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించారు. ఇలా మామ అల్లుళ్ళతో కలిసి నటించిన ఈమె వారిద్దరి క్యారెక్టర్స్ గురించి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వృషకర్మ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించగా బీవీఎస్ ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. నాగచైతన్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: చిరు మెగావర్స్ టాక్ షో ముహూర్తం పిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే?