E-Paper
Advertisement

MS సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం మరో సాహసానికి సిద్ధమైన రష్మిక!

MS సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం మరో సాహసానికి సిద్ధమైన రష్మిక!
Advertisement

Rashmika Mandanna: ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రష్మిక మందన్న (Rashmika mandanna) ఇందులో అమాయకత్వంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమాతో మొండి పిల్లగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న ఈమె..’ సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అల్లరి పిల్లగా అభిమానుల హృదయాలను దోచుకుంది. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఏకంగా నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకుంది.

మరో సాహసానికి సిద్ధమైన రష్మిక..

శ్రీవల్లిగా మెప్పించినా రష్మిక.. రణబాలి సినిమాలో జయమ్మ పాత్రతో రాయలసీమ అభిమానుల ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు ‘మైసా’ మూవీతో గోండు జాతి గిరిజన అమ్మాయిగా, యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధమైన రష్మిక. ఇప్పుడు.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్తో ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఇటీవల మైసా కోసం 8 గంటల పాటు నీటిలోనే పోరాటం.. చెప్పులు లేకుండా పర్వతారోహణ ఇలా ఎన్నో కఠినమైన సాహసాలు చేసి తన చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన రష్మిక.. ఇప్పుడు మరో సాహసానికి సిద్ధమయింది.

సంగీతం నేర్చుకోబోతున్న రష్మిక..

Advertisement

బయోపిక్ లో నటించడం అంటే వారిలాగా ప్రేక్షకులను మెప్పించడం మాత్రమే కాదు.. వారిలోని టాలెంట్ను ఇక్కడ తెరపై పండించగలగాలి. అప్పుడే బయోపిక్ కి పూర్తిస్థాయి జీవం పోసినట్టు అవుతుంది. ఈ క్రమంలోనే లెజెండ్రీ సింగర్ బయోపిక్ లో నటించడానికి సిద్ధమైన రష్మిక ఇప్పుడు మరో సాహసానికి సిద్ధమయ్యింది. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎంఎస్ సుబ్బులక్ష్మి సినిమా కోసం కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోబోతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. “జీవితంలో నేనెప్పుడూ కూడా పాటలు పాడలేదు. కనీసం హమ్ కూడా చేయలేదు. అయితే ఈ ప్రాజెక్టు కోసం తొలిసారి పాడే అదృష్టం లభిస్తోంది. ఇదంతా ఎంఎస్ అమ్మ వల్లే “అంటూ తెలిపింది రష్మిక. మొత్తానికి అయితే నటనతోనే కాదు ఇప్పుడు పాత్ర కోసం ప్రత్యేకంగా రాగాలు తీయడానికి సిద్ధమయ్యింది రష్మిక.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో..

ఎమ్. ఎస్ .సుబ్బులక్ష్మి బయోపిక్ విషయానికి వస్తే.. గౌతం తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లు అరవింద్ , బన్నీ వాస్ , వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకొని.. 2026 సెప్టెంబర్ 16న కమలహాసన్ తొలి క్లాప్ కొట్టడంతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభించబడింది. నాలుగు దక్షిణ భారత భాషలలో రూపొందించబడిన పాన్ ఇండియన్ చిత్రంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Advertisement

ALSO READ: 4 నెలలుగా సంతోషంగా ఉన్నా.. అనసూయ వీడియో వైరల్!

రష్మిక మందన్న తదుపరి చిత్రాలు..

రష్మిక మందన్న తదుపరిచిత్రాలు.. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్ ఫార్ములా ఫిలిమ్స్ నిర్మించిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా మైసా. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు నవంబర్ 27న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న రాకా సినిమాలో ఈమె ప్రతినాయకి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 3: ది రాంపేజ్ లో కూడా రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.

Related News

అనిరుద్ కావ్య వెడ్డింగ్ రిసెప్షన్.. ఖర్చు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే!

వెంకీ మామ చైతూ పై మీనాక్షి చౌదరి కామెంట్స్.. ఇద్దరిదీ ఒకటే క్యారెక్టర్ అంటూ!

నషాముక్త్ భారత్‌కు ప్రభాస్‌కు కిషన్‌రెడ్డి ఆహ్వానం.. పోస్టర్ ఆవిష్కరణ

రష్మిక ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్… వాయిదా పడిన మైసా.. కారణం ఏంటంటే?

గార్జీయస్ లుక్ లో మలయాళ బ్యూటి.. చూపులతోనే పిచ్చెక్కిస్తుంది మావా..

జీవితాంతం ప్రేమ.. సంతోషాలు.. రామలక్ష్మికి చిట్టిబాబు కంగ్రాట్స్ !

నెట్‌ఫ్లిక్స్‌లో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. వరుసగా నాలుగు సినిమాలతో టాప్ ట్రెండింగ్!

Big Stories

Advertisement
×