Anirudh Kavya Maran Wedding Reception: సౌత్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిరుద్ (Anirudh) ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈయన సన్ టీవీ గ్రూప్స్ అధినేత కళానిధి మారన్ వన్ అండ్ ఓన్లీ డాటర్ కావ్య మారన్(Kavya Maran) ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం నవంబర్ 10 ,11 తేదీలలో గ్రీస్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఇలా కొంతమంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇకపోతే ఈ కొత్త జంట తాజాగా చెన్నైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్(Wedding Reception) జరుపుకున్న సంగతి తెలిసిందే.
చెన్నైలో నవంబర్ 21వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్ వేడుకలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా సినీ తారలు రాజకీయ నాయకులు క్రికెటర్స్ ఈ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. ఇలా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేశారనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.
కావ్య మారన్ దాదాపు వేలకోట్లకు వారసురాలు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన వివాహం కోసం తన తండ్రి కళానిధి మారన్ వందల కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం కావ్య అనిరుద్ వెడ్డింగ్ గ్రీస్ వేదికగా ఎంతో ఘనంగా జరిపించారు. ఇలా ఈ వేడుక కోసం సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇటీవల చెన్నైలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కోసం సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కోలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం.
ఇలా వెడ్డింగ్ రిసెప్షన్ కోసం 50 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇలా వీరి వివాహపు వేడుక కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇక ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు పెద్దగా హాజరు కాలేదని చెప్పాలి. కేవలం మహేష్ బాబు కుటుంబం మాత్రమే హాజరయ్యారు . చివరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో పాల్గొనలేదు. ఈయనకు ఇన్విటేషన్ ఉన్నప్పటికీ తన కుమార్తె అర్హ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై రాకా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: వెంకీ మామ చైతూ పై మీనాక్షి చౌదరి కామెంట్స్.. ఇద్దరిదీ ఒకటే క్యారెక్టర్ అంటూ!