E-Paper
Advertisement

20 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు తమన్.. ‘బాయ్స్’ డ్రమ్మర్ రీఎంట్రీ ఫిక్స్!

20 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు తమన్.. ‘బాయ్స్’ డ్రమ్మర్ రీఎంట్రీ ఫిక్స్!
Advertisement

Thaman Comeback: తమన్.. టాలీవుడ్ లో ప్రస్తుతం తన మ్యూజిక్ తో థియేటర్లని  షేక్ చేస్తున్న ఈ మోస్ట్ క్రేజీ మ్యూజిషియన్  ఇప్పుడు రూట్ మార్చాడు .అవును బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ క్రేజీ ట్యూన్స్ తో  థియేటర్లో పునకాలు తెప్పించే తమన్ ఇప్పుడు మళ్లీ నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నాడు.

సరిగా 20 ఏళ్ల క్రితం  లెజెండ్రీ  డైరెక్టర్ శంకర్ క్రియేట్ చేసిన యూత్ ఫుల్ క్లాసిక్ బాయ్స్ సినిమాలో కృష్ణ అనే డ్రమ్మర్  పాత్రలో మెరిసిన తమన్ ఆ తర్వాత సంగీతానికే పరిమితమైపోయాడు .మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇలా కెమెరా ముందుకు  రావడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది .కోలీవుడ్ ప్రామిసింగ్ హీరో అదర్వ  మురళి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఇదయం మురళి’ అనే సినిమాలో తమన్ మళ్లీ నటుడిగా కనిపించబోతున్నాడు.

Advertisement

జులై 10న గ్రాండ్ గా రిలీజ్

తెలుగులో ‘హృదయం మురళి’అనే పేరుతో ఈ జులై 10న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడం విశేషం.ఇక తమన్ ఈ సినిమాలో కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా మ్యూజిక్ అందించడం ఇక్కడ మరో  విశేషం.అంటే ఒకే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా డ్యూయల్ రోల్ పోషించనున్నాడన్న మాట.ఇక సినిమా నుంచి వదిలిన ట్రైలర్ ఇప్పుడు నెట్టింట తెగ సర్క్యులేట్  అవుతుంది.

Advertisement

ఇక  ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ అండ్ మ్యూజికల్ ఎంటర్టైన్ అని క్లియర్ గా  అర్థమవుతుంది.ఇక తమన్ రెగ్యులర్ క్యారెక్టర్ ల   కాకుండా కథను మలుపు తిప్పే ఒక కీ రోలు పోషించాడని తెలుస్తుంది . విజువల్స్, అథర్వ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లుక్స్, అన్నిటికీ మించి తమన్ మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా అంచనాల్ని ఆకాశంలో పెట్టేశాయి.

ఎలాంటి సంచలనాలని నమోదు చేస్తుందో

ఇక ఈ సినిమాలో  ‘మురుగన్ సూపర్ మార్కెట్’ మరియు  లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బ్లాస్ట్ సినిమాతో హిట్ కొట్టిన  హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఇందులో అథర్వకు జోడీగా నటిస్తోంది. ఆమెతో పాటు  కయాదు లోహర్,  ఫహాద్ ఫాజిల్ మరియు నిహారిక కూడా ఈ చిత్రంలో  కీలక పాత్రలు పోషించడం విశేషం.ఇంత మంది స్టార్ కాస్టింగ్, దానికి తోడు తమన్ డ్యూయల్ రోల్ చేస్తున్న ‘హృదయం మురళి’ ఖచ్చితంగా జూలై 10న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలని నమోదు చేస్తుందో చూడాలి.

Related News

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

Big Stories

Advertisement
×