Anushka Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 20026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans) మధ్య 34వ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. విరాట్ కోహ్లీ అలాగే పడిక్కల్ అద్భుతంగా రాణించాలని నేపథ్యంలో అవలీలగా బెంగళూరు విజయం సాధించింది. అయితే ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ( anushka sharma) వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకరంగా తన చేతులతో సైగలు చేసింది.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
అంతేకాదు వేళ్ళు చూపిస్తూ అడ్డంగా దొరికిపోయింది. గతంలో మోహన్ లాల్ (mohanlal memes ) అసభ్యకరంగా చేతులతో సైగలు చేస్తూ దొరికిన సంగతి తెలిసిందే. అచ్చం అలాంటి సెలబ్రేషన్స్ తాజాగా విరాట్ కోహ్లీ (Virat Kohli) భార్య అనుష్క శర్మ చేయడం వివాదంగా మారింది. దీంతో క్రికెట్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. ఉన్నత స్థాయి క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అయి ఉండి కూడా అనుష్క శర్మ ఇంత చీప్ గా వ్యవహరిస్తారా ? కొంచమైనా బుద్ది ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Gujarat Titans) మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేజింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొమ్మిదో ఓవర్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అయితే ఆ శిక్ష నేపథ్యంలో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అసభ్యకరంగా వ్యవహరించారు. మోహన్ లాల్ తరహాలోనే చేతులతో సైగలు చేస్తూ బిహేవ్ చేశారు అనుష్క శర్మ. అదే కెమెరా ఆమె వైపు తిప్పగానే… చేతులతో సైగలు చేయడం వెంటనే ఆపేశారు అనుష్క శర్మ.
దీంతో అప్పటికే వీడియో వైరల్ అయింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అనుష్క శర్మ ఇలా వ్యవహరిస్తారా ? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇద్దరు పిల్లలను కన్నలేడీ ఇలా చేస్తారా ? ఇది ఇండియన్ కల్చర్ కాదంటూ మండిపడుతున్నారు. దీనిపై అనుష్క శర్మ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 20 ఓవర్లు వాడిన గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి చేదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
Anushka was doing that RCB dressing room celebration. when camera focused, she stopped and started laughing 😭😭😭 pic.twitter.com/3kBdh9B7I9
— Fearless🦁 (@ViratTheLegend) April 25, 2026