BigTV English

Tollywood: ‘చిరంజీవి గోడ మీద పిల్లి’… ఇండస్ట్రీ పెద్దపై డైరెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Tollywood: ‘చిరంజీవి గోడ మీద పిల్లి’… ఇండస్ట్రీ పెద్దపై డైరెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Director Mohammad Rafi Sensational Comments: సినీ కార్మికుల సమ్మె రోజుకో మలుపు తీసుకుంటోంది. 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు సైరన్‌ మోగించింది ఫిలిం ఫెడరేషన్‌. ఇప్పటికే ఇండస్ట్రీ నష్టాల్లో ఉందని, వేతనాలు పెంచలేమని నిర్మాతలు తెల్చేశారు. ఇటూ ఫెడరేషన్‌ తగ్గేదే లే అంటుంది. వేతనాలు పెంచకపోతే షూటింగ్‌లో పాల్గొనేది లేదని ప్రకటించింది. అంతేకాదు ముందస్తు నోటీసులు లేకుండానే సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నిరసన పక్కన పెట్టి షూటింగ్‌లో పాల్గొంటున్న కార్మికులపై దాడులు జరుపుతున్నారు. తమని కాదని షూటింగ్‌ పాల్గొంటే కష్టాలు తప్పవంటూ ఫెడరేషన్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె ఇండస్ట్రీలో పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా నిర్మాతలను ఈ సమ్మె సతమతం చేస్తోంది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్‌ ఇరు వర్గాలతో చర్చలు జరుపుతోంది.


పెద్ద దిక్కు లోటు.. ఇండస్ట్రీలో ప్రశాంత కరువు

ఇటూ నిర్మాతలు కానీ, అటూ ఫెడరేషన్‌ కానీ ఈ విషయంలో తగ్గడం లేదు. ఇప్పట్లో ఈ సమస్య కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితులకు కారణంగా ఇండస్ట్రీకి పెద్ది దిక్కు లేకపోవడమే అంటున్నారు డైరెక్టర్‌ మహమ్మద్‌ రఫీ. తాజా ఓ ఇంటర్య్వూలో ఈ మొత్తం వ్యవహరంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఫెడరేషన్‌కి ఎన్నిక జరిగితేనే ఈ వివాదం సద్దుమణిగేలా ఉందని, ఇండస్ట్రీ ప్రశాంతంగా ఉండాలంటే యూనియన్ల నాయకులు మారాలంటున్నారు. ఇక సమ్మె వెనుక యూనియన్‌ నాయకుల స్వార్థపు బుద్ది, కుంభకోణం ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. నిజానికి యూనియన్‌ నాయకులు అడ్డోగులు నిర్ణయాల వల్ల కార్మికుల్లోనే గ్రూపులు ఏర్పాడ్డాయన్నారు.


చెలరేగిపోతున్న యూనియన్ నేతలు

ఫెడరేషన్‌ నేత నిర్ణయాలు నచ్చక చాలామంది వారిని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో యూనియన్‌తో సంబంధం లేకుండ షూటింగ్‌లలో పాల్గొనవచ్చని నిర్మాతల మండలి పిలుపునిచ్చింది. ఇది చాలామందికి నచ్చింది. దీంతో ఫెడరేషన్‌కు సంబంధం లేకుండ చాలామంది కార్మికులు షూటింగ్‌లకు హాజరవుతున్నారు. దీంతో అలాంటి వారిని దారిలో తెచ్చుకునేందుకు నేతలు దాడులకు కూడా తెగించారు. షూటింగ్‌ సెట్‌కి వెళ్లి మరి సత్యనారాయణ అనే కాస్ట్యూమర్‌ని కొట్టారు. దీనివల్ల మిగతవారిలో భయం పుట్టి వారి దారికి వస్తారనేది ఫెడరేషన్‌ ఆలోచన. ఫెడరేషన్‌ నేతల ఇష్టారీతి నిర్ణయాలు, దాడుల వల్ల ఇండస్ట్రీలో ప్రశాంతత కరువైంది. దీనంతటికి కారణం ఆయా యూనియన్ల లో ఎన్నికలు లేకుండా ఇష్టా రాజ్యాంగా పదవులకు అతుక్కుని దాదా గిరి చేస్తూ చిత్రపురి కాలనీ స్థలాలను అడ్డగోలుగా అమ్ముకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయన్నారు.

ప్రశాంత కావాలంటే.. యూనియన్లకు ఎన్నికలు జరిగాలి

పదవీ కాలం పూర్తయినా ఇప్పటివరకు ఏ యూనియన్‌కు ఎన్నికలు లేవు. అవే కమిటీలు కొనసాగుతున్నాయి! వెంటనే కార్మిక శాఖ కలగజేసుకుని ఎన్నికలు జరిపించాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో పాటు చిత్రపురి ఎన్నికలు కూడా జరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం సమసిపోతుందంటున్నారు. అయితే ఈ వ్యవహరమంత ఇప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మీదకు మళ్లీంది. ఆయన తీరు, కామెంట్స్ ఫెడరేషన్‌ నేతలు, కార్మికులను రెచ్చగొట్టేలా ఉన్నాయంట. ఇక్కడ కార్మికులకు స్కిల్‌, టాలెంట్‌ లేదంటూ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు ఫెడరేషన్‌ను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా ఉన్న ఫెడరేషన్‌ నేతలను ఆయన కామెంట్స్‌ మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

సమస్యను తగ్గించాల్సింది పోయి.. ఇలా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ సమస్యను మరింత ముదిరేలా చేస్తున్నారట. దీంతో వెంటనే సినీ పెద్దలు కలుగజేసుకుని ఈ దీనిపై ఓ పరిష్కారం చూపించాలంటున్నారు. కానీ, ఇండస్ట్రీ పెద్దన్నగా ఉన్న చిరంజీవి తీరు ఈ వ్యవహారంలో గొడమీద పిల్లిలా ఉందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఎవరైనా సమస్య ఉన్నప్పుడే పరిష్కారం చూపాలన్నారు. కానీ, కొన్ని రోజుల చూసి.. ఆ తర్వాత పరిష్కరిస్తాననడం ఎంతవరకు సబబు.. అదే దాసరి నారాయణ రావు గారు అయితే.. తక్షణమే రంగంలోకి దిగి సమస్యకు పరిష్కారం చూపేవారు. అదే ఆయనే ఉండి ఉంటే.. అసలు ఈ సమ్మె ఊసే రాకపోయేదని మహమ్మద్‌ రఫీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు అదే అసలైన నాయకుడి లక్షణమని, ఇప్పుడు ఆయన లేని లోటు, చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు లేని లోటు స్పష్టం కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read: Manchu Vishnu: హీరోయిన్‌లకు ‘మా’ కండిషన్స్.. SIIMAపై నటి ఫిర్యాదుతో విష్ణు కీలక ప్రకటన

Related News

War 2 Duration : సినిమా డ్యూరేషన్ మరీ అంత సేపా? ఎవరిని పరీక్షిస్తున్నారయ్యా..

Nani Paradise: ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో నాని పారడైజ్ ఫస్ట్ లుక్, ఈసారి ఏమి తగలబెడతాడో

Ntr -Hrithik: ఎన్టీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ పంపిన హృతిక్… అసలైన వార్ అప్పుడే అంటూ తారక్ రిప్లై!

Prashanth Neel: సలార్ ఎఫెక్ట్.. ఆ హీరోకి క్షమాపణలు చెప్పిన ప్రశాంత్.. కావాలని చెయ్యలేదంటూ!

Usthad Bagath Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన సమ్మె ఎఫెక్ట్ ఏమైనా పడిందా ? ప్రొడ్యూసర్ రిప్లై…

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ నేనే యాక్షన్ తీసుకుంటాను, మండిపడ్డ కే ఎ పాల్

Big Stories

×