Maa President Manchu Vishnu: ప్రముఖ అవార్డు సంస్థ సైమా స్కాంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన అవార్డు ఫంక్షన్ తనకు పారితోషికం ఇవ్వకుండ ఎగ్గొట్టారని, తనకు న్యాయం జరిపించాలని మాను ఆశ్రయించింది. సదరు హీరోయిన్ ఫిర్యాదుపై తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఈ మేరకు కాస్టింగ్, ఈవెంట్ మేనేజర్స్తో ఆయన సమావేశమై చర్చించారు. అనంతరం కీలక ప్రకటన చేస్తూ కొన్ని షరతులు విధించారు. ఇక నుంచి నుంచి ఆర్టిస్ట్‌లు అవార్డుల ఫంక్షన్లలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఈవెంట్ మేనేజర్స్, నటీనటులు ‘మా’ అసోసియేషన్ అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు.
‘మా’ అనుమతి తప్పనిసరి
అవార్డ్ ఫంక్షన్లతో పాటు ఇతర ఏ కార్యక్రమాలు జరిగినా, సినీ ఆర్టిస్ట్‌లు ఏ విధమైన(డ్యాన్స్, స్కిట్స్, మిమిక్రీల వంటివి) వంటి పెర్ఫార్మెన్స్ చేసిన ‘మా’ అసోసియేషన్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించారు. కాగా గతంలో చాలా అవార్డుల ఫంక్షన్లలో పెర్ఫామ్ చేసిన నటీనటులకు పారితోషికం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో మా అనుమతి తీసుకుని తర్వాత ఈవెంట్స్ మ్యానేజ్ చేసుకోవాలన్నారు. ఈ షరతులు కేవలం ఇండియాలోనే కాకుండ ప్రపంచవ్యాప్తం ఎక్కడ పర్ఫామెన్స్ చేసిన వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనను తక్షణమే ఆయన అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ‘మా’ నిర్ణయంతో సదరు అవార్డుల సంస్థ దిగొచ్చి.. సదరు నటికి పారితోషికం చెల్లించినట్టు తెలుస్తోంది.
సైమా స్కాంపై ఆ హీరోయిన్ ఫిర్యాదు
కాగా దక్షిణాది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సైమా అవార్డులు ఒకటి. సౌత్ మూవీ ఇండస్ట్రీలో తమదైన నటనతో అత్యంత ప్రతిభ కనబర్చిన నటీనటులను ఈ అవార్డుతో సత్కరిస్తారు. ప్రతి ఏడాది ఎంతో గ్రాండ్గా నిర్వహించే ఈ అవార్డుల కార్యక్రమం గతేడాది దుబాయ్లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో దక్షిణాది సినీ పరిశ్రమలు తెలుగు, తమిళ్, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి ఎంతో నటీనటులు హాజరయ్యారు. అంతేకాదు పలువురు స్టార్ హీరోయిన్లు డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు ఇచ్చారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు రూ. 50 లక్షల పారితోషికం డిమాండ్ చేయగా.. సైమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈవెంట్కి ముందు రూ. 30 లక్షలు ఇచ్చిన సైమా.. ఆ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ విషయంలో మొఖం చాటేసిందట. ఒక్క ఆ హీరోయిన్కే కాదు.. ఈ ఈవెంట్ పర్ఫామ్ చేసిన ఎంతోమంది నటీనటులకు, హీరోలకు కూడా పారితోషికం ఇవ్వకుండ ఇబ్బంది పెట్టిందిట. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం సైమా స్కాంపై మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇప్పించాలని మాను కోరగా.. దీనిని అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్గా తీసుకున్నారు. తక్షణమే ఈవెంట్ మేనేజర్స్ సమావేశమై.. కొన్ని కండిషన్స్ పెట్టారు. అంతేకాదు సదరు హీరోయిన్ పారితోషికం కూడా ఇప్పించారట. ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఈవెంట్స్ జరిపించిన, అందులో నటీనటుల పర్ఫామెన్స్ కావాలన్నా ‘మా‘ అనమతి తప్పనిసరిగా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ షరతు నటీనటులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనను తక్షణమే అమలులోకి మంచు విష్ణు వెల్లడించారు.
Also Read: SIIMA 2024 Scam: సైమా స్కాం.. మా అసోసియేషన్‌లో స్టార్ హీరోయిన్ ఫిర్యాదు?