E-Paper
Advertisement

Graduate Elections: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఆ రెండు స్థానాలపై నేతల ఫోకస్..!

Graduate Elections: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఆ రెండు స్థానాలపై నేతల ఫోకస్..!
Advertisement

Graduate Elections: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ప్రధాన రాజకీయా పార్టీల నజర్ ఇప్పుడు విద్యావంతుల ఓట్లపై పడింది. రాష్ట్రంలో మరో కీలకమైన ఎన్నికల అంకానికి తెరలేవబోతోంది. వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరి మాసంతో గడువు ముగియనున్న రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ స్థానాలకు ముందస్తు వ్యూహ ప్రతివ్యూహాలు ఇప్పుడే మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటోంది. గత ఎన్నికల పరాభవం నుంచి కోలుకుని, కేడర్‌లో నూతనోత్సాహం నింపేందుకు ఈ ‘పట్ట’భద్రుల ఎన్నికలను ఒక మైలురాయిగా మార్చుకోవాలని గులాబీ దళం భావిస్తోంది. అయితే, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విద్యావంతులు, ఉద్యోగులు మళ్లీ కారు గుర్తుకు జై కొడతారా? లేదా? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు గులాబీ పార్టీ నుంచి రేసులో ఉన్న అభ్యర్థులు ఎవరు? టిక్కెట్ ఎవరికి దక్కే అవకాశం ఉందనేది కూడా చర్చకు దారితీసింది.

ఆ రెండు స్థానాలు.. ప్రతిష్టాత్మకం!

తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలుజరగనున్నాయి. ఒకటి ఖమ్మం, వరంగల్, నల్గొండ రెండోది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. ఈగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు 2027 మార్చి 29న పదవీ కాలం ముగియనుంది.గతంలో ఈరెండు స్థానాలు గతంలో బిఆర్ఎస్ పార్టీకిసిట్టింగ్ స్థానాలుగా ఉన్నాయి. ఉపఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. తిరిగి వచ్చే ఏడాదిఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈసెప్టెంబర్ నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు రెండుసార్లు ఇదే స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి సురభి వాణీ దేవి ఎమ్మెల్సీగాప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ పీఎం పీవీ నర్సింహా రావు కుమార్తెగా వాణిదేవికి గుర్తింపు ఉంది.

వాణీ దేవి పోటీకి దూరం..?

Advertisement

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సురభివాణీ దేవిని గెలిపించుకుంది. రాబోయే ఎన్నికల్లోసురభి వాణీ దేవి పోటీకి దూరంగా ఉండే ఛాన్స్ఉందని సమాచారం. వయో భారం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఎన్నికలకు సురభి వాణీ దేవి పోటీ చేసే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది. దీంతో ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం గులాబీ పార్టీ పరిశీలన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని సగానికి పైగా భౌగోళిక ప్రాంతం, అత్యధిక సంఖ్యలో విద్యావంతులు ఓటర్లుగా ఉన్న స్థానాలు కావడంతో.. ఈ ఎన్నికల సరళి భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా మారనుంది. ఒక స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, చేజారిన రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ రెండు స్థానాలను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. విజయం సాధించి కేడర్‌లో, నేతల్లో జోష్ నింపి రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని భావిస్తుంది.

Also Read: Gachibowli History: ఏంటీ.. గచ్చిబౌలి చరిత్ర ఇదా, ఆ పేరు రావడానికి కారణం ఇదేనట.. అద్భుతం కదూ!

ఈ క్లాస్ యాప్..

Advertisement

ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్ట భద్రుల స్థానంలో గత ఉప ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన తీన్మార్ మల్లన్నపై ఓడిపోయారు.అప్పటి నుంచి ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ఫోకస్ పెట్టి ఏనుగుల రాకేష్ రెడ్డి పని చేస్తున్నారు. పోటీ పరీక్షలకు ఈ క్లాస్ యాప్ ప్రారంభించారు. దీంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, యువతలో ప్రత్యేక గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిరుద్యోగుల సమస్యలపై, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నిరుద్యోగ భృతి, జాబ్ కేలెండర్, నోటిఫికేషన్లు, ఫీజు రియాంబర్స్ మెంట్ అంశాలపైనా గళం ఎత్తుతున్నారు. జనగామ
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతు సైతం బలంగా ఉంది. గులాబీ అధిష్టానం సైతం మరో సారి ఏనుగుల రాకేష్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసి వస్తుందని గులాబీ పార్టీ లెక్కలు వేస్తోంది.

అభ్యర్థి కోసం బీఆర్ఎస్ కసరత్తులు..

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ కసరత్తులు స్టార్ట్ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఐ.ఆర్.ఎస్ అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన అధికారి వీఆర్ఎస్ తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి సైతం తనకు పోటీ చేసే అవకాశంఇవ్వాలని గులాబీ అధిష్టానం పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం. నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. మరోవైపు మరి కొంత మంది పేర్లను బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోందని విశ్వసనీయంగా తెలిసింది.

Also Read: Corporation Appointments: కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్.. ఫైనల్ లిస్ట్ విడుదల..?

నిరుద్యోగులే అస్త్రంగా.. గులాబీ గళం!

గత ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ తీసింది. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదనే అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు, సోషల్ మీడియా వింగ్ క్షేత్రస్థాయిలో యువతతో మమేకమవుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు తీరును ఎండగడుతూ, నిరుద్యోగుల పక్షాన నిలబడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

ఓటర్ల నమోదుపైనే నజర్..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును శాసించేది ‘ఓటర్ల నమోదు’ కొత్తగా డిగ్రీలు పూర్తి చేసిన వారిని, పాత ఓటర్లను మళ్లీ నమోదు చేయించే ప్రక్రియపై బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఫోకస్ పెట్టాయి. నవంబర్ నుంచి ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతి డివిజన్, గ్రామీణ స్థాయిలో గ్రాడ్యుయేట్లను గుర్తించి ఫారాలు నింపే బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించబోతున్నట్లు సమాచారం.

గులాబీ దళం వ్యూహాలు..

అయితే, అధికార బలంతో రెండు స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్.. విద్యావంతుల్లో తమకున్న పట్టుతో సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో, అటు అధికార పార్టీ వ్యూహాలను తిప్పికొడుతూ.. ఇటు పట్టభద్రుల మనసు గెలిచి గులాబీ జెండా ఎగరేయడం బీఆర్ఎస్‌కు టెస్టే అని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. మళ్లీ పుంజుకోవడానికి ఈ ‘పట్ట’భద్రుల ఎన్నికలను ఒక వేదికగా మార్చుకోవాలని గులాబీ దళం వ్యూహాలు రచిస్తోంది. అయితే, మారుతున్న ఓటర్ల నాడిని పట్టుకుని గులాబీకి పట్టభద్రులు మళ్లీ జై కొడతారా? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హోరాహోరీ త్రిముఖ పోరులో.. గులాబీ దళం పట్టభద్రుల మనసు గెలిచి మళ్లీ పూర్వవైభవాన్ని చాటుకుంటుందో.. లేదో వేచి చూడాలి.

Also Read: నల్లగొండ జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందా? వర్షాకాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

Related News

Singareni Mines: చరిత్రలోనే తొలిసారిగా సింగరేణి భారీ రికార్డు.. ఒకే సారి 5-స్టార్ రేటింగ్..?

Corporation Appointments: కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్.. ఫైనల్ లిస్ట్ విడుదల..?

జోగిపేటలో టెక్షన్ టెన్షన్.. బీఫ్ వర్సెస్ మటన్ షాపుల వ్యవహారం, రెండు వర్గాల మధ్య ఘర్షణ

షాబాద్‌లో ఆరుగురు హత్యలు.. వెలుగులోకి కొత్త విషయాలు, పదునైన కత్తితో- రెండు గంటల్లో

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్.. ఏ ఏరియాల్లో అంటే?

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర.. 1500 కండక్టర్ పోస్టుల భర్తీ, విద్యార్హతలో తర్జన భర్జన

ఉదయం నిరసన సెగ.. సాయంత్రానికే దిగొచ్చిన హైడ్రా.. బస్తీవాసుల ఆందోళనలకు కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

Big Stories

Advertisement
×