E-Paper
Advertisement

‘రావు బహదూర్ ‘ మూవీ పై ప్రియదర్శన్ కామెంట్స్..ఇది అస్సలు ఊహించలేదు బ్రో..!

‘రావు బహదూర్ ‘ మూవీ పై ప్రియదర్శన్ కామెంట్స్..ఇది అస్సలు ఊహించలేదు బ్రో..!
Advertisement

Priyadarsan: బలగం ఫేమ్ నటుడు ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు సినిమాలలో సపోర్టింగ్ రోజులలో నటించి ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ప్రియదర్శన్ నటించిన సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈయన రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ సినిమా గురించి ఆసక్తికర విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు.. హీరో సత్యదేవ్ నటించిన రావు బహదూర్ మూవీ గురించి వివరిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ మూవీ గురించి ప్రియదర్శన్ ఏమన్నారో చూద్దాం..

‘రావు బహదూర్’ మూవీ పై ట్వీట్..

సినీ నటుడు ప్రియదర్శన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. తాజాగా హీరో సత్యదేవ్ నటించిన రావు బహదూర్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.. ఆ పోస్ట్ లో రావు బహదూర్ లాంటి సినిమాలు మళ్లీ రావు.. అదృష్టం ఉంటే దశాబ్దానికి ఒకసారి వస్తాయేమో. ఈ మూవీ మీ ఆలోచనలను కట్టిపడేస్తుంది. వెంకటేష్ మహా ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారు. కానీ అది తన గురించి తాను వివరించుకోదు. కావాలనే అలా చేశారు. ఇది చూసి వదిలేసే సినిమా కాదు.. కంటెంట్ కోసం ఆరాటపడే ఈ కాలంలో కూడా చివరివరకు మంచి అనుభూతిని అందిస్తుంది. ఓటీటీ లో ఈ మూవీని చూసేదానికన్నా థియేటర్లలో ఈ మూవీని చూడండి అని ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Advertisement

Also Read :‘ కార్తీక దీపం’ మాలిని రియల్ లైఫ్ లో ట్విస్ట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

ప్రియదర్శన్ పై నెటిజన్లు ప్రశంసలు..

సినీ నటుడు ప్రియదర్శన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో కష్టాలని అనుభవించి ఇండస్ట్రీలోకి వచ్చిన విషయాన్ని గతంలో చాలా సార్లు ఆయన ప్రస్తావించారు.. సినిమా కష్టాలు ఎలా ఉంటాయో తనకి బాగా తెలుసు అని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని బయట పెట్టాడు.. రీసెంట్ గా సేవ్ ది టైగర్స్ సీజన్ 3 లో ఆయన నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదట వచ్చిన రెండు సీజన్లు సక్సెస్ఫుల్ టాక్ని అందుకోవడంతోపాటు ఈ సీజన్ కూడా మంచి టాక్ ని అందుకుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రియదర్శన్ వేరే హీరోల సినిమాలపై ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టడం పై పలువురు నెటిజన్లు ఆయన ను అభినందిస్తున్నారు… మన సినిమా గురించి అని కాకుండా వేరే హీరోల సినిమా గురించి కూడా ఇలా ఆలోచించడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Related News

‘టాక్సిక్’లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లెక్క చూస్తే మైండ్ బ్లాక్!

ఇరుముడి దెబ్బకి బాక్సాఫీస్ షేక్.. టాప్-5లోకి ఎంట్రీ!

అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత!

దసరా బరిలో ‘రణబాలి’.. రిలీజ్ డేట్ లాక్!

మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతున్న తెలుగమ్మాయి.. సక్సెస్ అవుతుందా?

నాగ్ బర్త్ డే ట్రీట్ లోడింగ్.. ఫ్యాన్స్ కు పునకాలే..!

‘ఇరుముడి’తో సంచలనం సృష్టించిన బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

యంగ్ హీరో సూసైడ్.. హీరోయిన్ చనిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

Big Stories

Advertisement
×