E-Paper
Advertisement

Lenin Movie : హే అఖిల్ కంగ్రాట్స్.. ‘లెనిన్’ సక్సెస్ పై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్..

Lenin Movie : హే అఖిల్  కంగ్రాట్స్.. ‘లెనిన్’ సక్సెస్ పై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్..
Advertisement

Lenin Movie : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం లెనిన్. ఈ మూవీ నిన్న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా  థియేటర్లలో రిలీజ్ అయింది. అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా సాలిడ్ తన ఖాతాలో పడలేదు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.. మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లాస్ లుక్ లో కనిపించే అఖిల్ మాస్ స్టోరీ తో ప్రేక్షకులను పలకరించడంతో జనాలు ఫిదా అయ్యారు. ఈ మూవీ సక్సెస్ అవ్వడం పై అక్కినేని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అఖిల్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అఖిల్ కు కంగ్రాట్స్ చెప్తూ స్పెషల్ ట్వీట్ చేశారు.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆ ట్వీట్ లో ఏముందో ఒకసారి తెలుసుకుందాం..

‘హే అఖిల్’ కంగ్రాట్స్..

అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం లెనిన్. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది.. ప్రీమియర్ షో ల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మూవీ సక్సెస్ అయినందుకు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేశారు. అఖిల్ తన సినీ కెరియర్లో ఈ సినిమా అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. ఇప్పటివరకు క్లాస్ హీరోగా కనిపించిన అఖిల్ ఈ మూవీతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. ఈ మూవీ సక్సెస్ అయినందుకు గాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశారు.. అందులో అఖిల్ అక్కినేనిని ట్యాగ్ చేస్తూ.. హే అఖిల్ ‘లెనిన్‌’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నందుకు గాను బిగ్ కంగ్రాట్స్’ అంటూ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఇంత పాజిటివ్ గా ట్వీట్ చేయడం పై అక్కినేని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు..

అక్కినేని కుటుంబంతో ఆర్జీవికీ అనుబంధం..

Advertisement

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. కొందరు దర్శకులతో ఆ ఫ్యామిలీకి మంచి బాండింగ్ఉంటుంది. అలాంటి వారిలో చిత్ర దర్శకుడు ఆర్జీవి ఒకరు.. అక్కినేని ఫ్యామిలీతో ఈయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.. హీరో నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి.. ఇప్పుడు అఖిల్ సక్సెస్ లో ఆయన కూడా భాగం అవడం అక్కినేని అభిమానులకు మరింత ఉత్సాహాన్ని నింపింది.. ఏది ఏమైనా కూడా ఇన్నాళ్లకు అఖిల్ కళ నెరవేరింది.. తన అకౌంట్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ పడిపోయింది.. ‘ఏజెంట్’ వంటి భారీ పరాజయం తర్వాత రెండేళ్లుగా అఖిల్ పడిన కష్టానికి, ఎదుర్కొన్న విమర్శలన్నింటికీ లెనిన్ సక్సెస్ సమాధానం చెప్పింది.. అఖిల్ తన సినిమా సక్సెస్ అయినందుకు తన తండ్రి కాళ్ల మీద పడి ఎమోషనల్ అయిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఇక లెనిన్ మూవీ విషయానికొస్తే.. పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది… మరి ఈ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

Also Read : ‘ కార్తీక దీపం’ మాలిని రియల్ లైఫ్ లో ట్విస్ట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Advertisement

Related News

నేను బ్రతికున్నంత వరకు నీ ఆత్మ నరకం అనుభవించాలి – తనుశ్రీ

పెళ్లి వద్దు.. పిల్లలు ముద్దు.. నరేష్ ఊహించని కామెంట్!

చిరంజీవి మూవీని వదులుకున్న బాలయ్య కూతురు!

తెరపై పద్ధతిగా.. నెట్టింట స్టైలిష్‌గా.. సురేఖా వాణి రూటే సెపరేటు!

‘ఏందయ్యా సామి’ తర్వాత ‘కోబలి’.. ఈసారి రచ్చ మామూలుగా లేదుగా !

మాస్ మహారాజా కూతురు అదుర్స్…. హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడో !

రామ్ చరణ్ RC 17.. రంగంలోకి అనిరుద్? హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ!

చిరు ఇండస్ట్రీకి మొగుడవుతాడని చెప్పిన ఆ హీరో ఎవరో తెలుసా?

Big Stories

Advertisement
×