Snake In Metro Rail : అది మెట్రో రైల్. లేడీస్ కోచ్. ఫుల్ రష్‌గా ఉంది. ఎక్కువ మంది కాలేజ్, ఆఫీస్‌కు వెళ్లే యువతులే ఉన్నారు. కిక్కిరిసిపోయి ఉంది ఆ బోగి. నిలబడటం కూడా కష్టంగా ఉంది. అయినా, ఎలాగోలా జర్నీ చేస్తున్నారు. అంతలోనే పెద్ద అరుపు. పాము..పాము.. అంటూ కేక వినిపించింది. ఇంక అంత మెట్రోలో కాక మొదలంది. లేడీస్ కంపార్ట్‌మెంట్ మొత్తం కలకలం చెలరేగింది.
లేడీస్ కోచ్‌లో స్నేక్
పాము..పాము..అంటూ అంతా బెదిరిపోయారు. అసలే అమ్మాయిలు. బల్లి, బొద్దింకలను చూస్తేనే భయపడతారు. అలాంటిది పాము అంటే మామూలుగా ఉంటుందా ఇక. ఒకటే హడల్. లేడీస్ కోచ్‌లో గోల గోల. తోసుకున్నారు. కూర్చున్న వాళ్లు కాళ్లు పైకి ఎత్తిపట్టుకున్నారు. కొందరు సీట్ల మీదకు ఎక్కారు. మరికొందరు మరోవైపుకు పరుగులు పెట్టారు. పక్కకు నక్కారు. అయితే, బోగీనిండా జనం ఉండటంతో వారు మరీ ఎక్కువ దూరం వెళ్లలేక పోయారు. అక్కడక్కడే పాము పాము అంటూ పక్కకు ఒదిగిపోయారు. అంతలోనే ఓ యువతి బ్యాగ్ కింద పడిపోయింది. అక్కడే పాము ఉందనుకొని ఆ బ్యాగ్‌ను కాళ్లతో తొక్కారు కొందరు సాహస మహిళలు. అలా కొన్ని నిమిషాల పాటు గందరగోళం చెలరేగింది.
Also Read : భీమవరంలో తాగుబోతుల అటాక్.. అంతా మైనర్లే.. వీడియో వైరల్
ఎమర్జెన్సీ స్టాప్
అందులో ఓ అమ్మాయికి స్మార్ట్ ఐడియా వచ్చింది. వెంటనే కోచ్‌లో రెడ్ కలర్‌లో ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కేసింది. మేటర్ మెట్రో డ్రైవర్‌కు చేరింది. వెంటనే అతను రైల్‌ను స్టేషన్లో ఆపేశాడు. విషయం ఏంటని కనుక్కుంటే.. బోగిలో పాము వచ్చిందని చెప్పారు. వెంటనే ఆ మెట్రో రైల్‌లో ఉన్న ప్రయాణీకులందరినీ దింపేశారు. తనిఖీల కోసం ట్రైన్‌ను డిపోకు తరలించారు.
చివరికి ఏమైందంటే..
డిపోలో మెట్రో రైల్‌ను క్షుణ్ణంగా చెక్ చేశారు సిబ్బంది. అయితే పాము కనిపించలేదు. చిన్న బల్లి పిల్ల మాత్రం పడుంది అక్కడ. డౌట్ వచ్చి రైల్‌లోని సీసీకెమెరా ఫుటేజ్ మొత్తం పరిశీలించారు. అందులోనూ ఎక్కడా పాము కనిపించలేదు. అంటే..? ఆ కోచ్‌లో పాము లేదు. బల్లి పిల్లను చూసే పాము అని అంతలా బెదిరిపోయారు అమ్మాయిలు. నిజంగా బల్లిని చూపి పాము అనుకున్నారో.. లేదంటే, ఏ తుంటరి పిల్లనో తమాషాకు కావాలనే అలా పాము పాము అని అరిచిందో తెలీదు. ఒకరిని చూసి ఒకరు.. పాము పాము అంటూ పెద్ద సీనే క్రియేట్ చేశారు. పాపం ఆ లేడీస్ అంతా బాగా హడలిపోయారు. ఢిల్లీ మెట్రోలో జరిగింది ఇదంతా. అదే కోచ్‌లో ఉన్న ఓ మహిళ ఆ హడావుడి అంతా వీడియో తీసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఫుల్ వైరల్ అవుతోంది.
Snake Found inside Ladies Coach in Delhi Metro
pic.twitter.com/J9ewritp2P— Ghar Ke Kalesh (@gharkekalesh) June 20, 2025