BigTV English

Sekhar Kammula : పాపం శేఖర్ కమ్ముల… దిక్కులేని వాడు అయిపోయాడట

Sekhar Kammula : పాపం శేఖర్ కమ్ముల… దిక్కులేని వాడు అయిపోయాడట

Director Sekhar Kammula : శేఖర్ కమ్ముల ఇండస్ట్రీ హిట్ సినిమాలేం చేయలేదు. అయినా… ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫీల్ గుడ్ సినిమాలు చేస్తూ ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ మధ్యే ఆయన డైరెక్షన్‌లో వచ్చిన కుబేర మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ధనుష్, నాగార్జున నటించిన ఈ చిత్రం మిక్సిడ్ టాక్ అందుకున్నా… ఓ వర్గం ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇదింత పక్కన పెడితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఏ దిక్కులేని వాడిని అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చేయడానికి కారణం ఏంటి ? నిజంగానే డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఎవరూ లేరా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


శేఖర్ కమ్ముల చేసే ప్రతి సినిమాలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన మొదటి సినిమా డాలర్ డ్రిమ్స్ నుంచి నేటి కుబేర వరకు.. అన్ని సినిమాల్లో ఓ సోషల్ మెసెజ్ ఉంటుంది. లవ్ స్టోరీ లాంటి లవ్ ఎంటర్‌టైన్‌ర్‌లో కూడా ఆయన సమాజానికి ఓ మెసెజ్ ఇచ్చాడు. అయితే, ఈయన ఒంటరి వాడు అయ్యాడట. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… తాను ఏ దిక్కు లేని వాడిని అయిపోయా అంటూ కామెంట్ చేశాడు.

అసలు విషయం ఏంటంటే..? శేఖర్ కమ్ముల డైరెక్టర్ అడుగు పెట్టిన తర్వాత తన రెండో సినిమా ఆనంద్ నుంచి వరుసగా వేటూరి సుందరరామ మూర్తితో వర్క్ చేశాడు. ‘ఆనంద్’ సినిమాలో అన్ని సాంగ్స్‌కు వేటూరినే లిరిక్స్ అందించారు. అలాగే ‘గోదావరి’ సినిమాలో ఉప్పొంగెలే గోదావరి… అనే సాంగ్‌కు లిరిక్స్ ఇచ్చారు. ‘హ్యాపీ డేస్‌’లో టైటిల్ సాంగ్‌కు లిరిక్స్ అందించారు. ఇక ‘లీడర్’ సినిమాలో ఉన్న ఆరు సాంగ్స్‌కు గాను నాలుగు సాంగ్స్‌కు లిరిక్స్ వేటూరినే ఇచ్చారు.


ఆ సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అంతే కాదు.. ఆ సాంగ్స్ వల్ల సినిమా ఎక్కడికో పోయింది. ఇది శేఖర్ కమ్ముల కూడా చాలా సందర్భాల్లో అంగీకరించాడు. అయితే ఇప్పుడు వేటురు సుందరరామ మూర్తి లేరు. అది ఆయనకు తీరని లోటు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పాడు.

వేటురి సుందరరామ మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే తనకు చాలా ఇష్టమని, ఈ ఇద్దరి చాలా మిస్ అవుతున్నాని అన్నాడు. వేటురు సుందరరామ మూర్తి ఇప్పుడు ఉంటే.. కుబేర సాంగ్స్ అన్నీ కూడా ఆయన చేతిలోనే పెట్టే వాడినని అన్నారు. కుబేర సాంగ్స్ వేటురి చేతిలో ఉంటే సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లేదని, ఆయన అలా లిరిక్స్ రాస్తారని అన్నాడు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తానెప్పుడు వర్క్ చేయలేదు కానీ, ఆయన స్టైల్ తనకు బాగా తెలుసు అని అన్నాడు. వాళ్లు ఇద్దరు లేకపోవడంతో ఒక ఫిల్మ్ డైరెక్టర్ గా దిక్కులేనివాడిని అయిపోయాను అంటూ కామెంట్ చేశాడు.

Related News

Ss Rajamouli: పవన్ కళ్యాణ్ సినిమాని కామెంట్ చేసిన రాజమౌళి, వైరల్ అవుతున్న పోస్ట్

MOWGLI : మొగ్లీ సినిమా కోసం రామ్ చరణ్, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు

Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్!

DUDE First Gear: డ్యూడ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది, ఎక్సలెంట్ ఎనర్జీ

OG Film Story: ఓజి సినిమా కంప్లీట్ కథ ఇదే, హే సుజీత్ ఈ మాత్రం చాలయ్యా 

Kamalini Mukherjee : నాగార్జున సూపర్ హాట్.. హీరోయిన్ ఇలా అనేసిందేంటీ భయ్యా

Big Stories

×