Venky Atluri: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో వెంకీ అట్లూరి ఒకరు. తొలిప్రేమ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన మిస్టర్ మజ్ను, రంగ్ దే, సార్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల వెంకీ అట్లూరి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల లక్కీ భాస్కర్ (Lucky Bhaskar)సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో(Suriya) కలిసి మరొక సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని ఈయన వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఏదైనా ఒక హిట్ సినిమా వచ్చిందంటే ఆ సినిమాకు తప్పనిసరిగా సీక్వెల్ రావడం సరికొత్త ట్రెండ్ అయింది.
సీక్వెల్ కు సిద్ధమైన లక్కీ భాస్కర్..
ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్(Dulquer Salman), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరో హీరోయిన్లుగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాకు కూడా సీక్వెల్ రాబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై తాజాగా వెంకీ అట్లూరి క్లారిటీ ఇచ్చారు. తప్పనిసరిగా లక్కీ భాస్కర్ 2 (Lucky Bhaskar 2)ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఈ సీక్వెల్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధమవుతోంది అంటూ ఈయన తెలియచేశారు. లక్కీ భాస్కర్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి తదుపరి మరో హిట్ సినిమాని చేయబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషపడుతున్నారు.
తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారా?
ఇకపోతే వెంకీ అట్లూరి ఇటీవల కాలంలో తెలుగు హీరోల కంటే కూడా ఇతర భాష హీరోలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో ఈయన విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఇదివరకు కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ తో సార్ అనే సినిమా చేసి సక్సెస్ అందుకున్న వెంకీ అనంతరం మలయాళ హీరోకి లక్కీ భాస్కర్ తో మరొక హిట్ అందించారు. ఇప్పుడు తదుపరి సినిమా కూడా సూర్యతో చేస్తున్న నేపథ్యంలో ఈయన చేయడానికి తెలుగులో హీరోలు లేరా అంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే తన సినిమాలన్నింటికీ కూడా మొదట ఛాయిస్ తెలుగు హీరోలనే ఎంచుకున్నానని వాళ్లు రిజెక్ట్ చేయడంతోనే ఇతర భాష హీరోలను ఎంపిక చేసినట్లు కూడా తెలిపారు.
మరో సంజయ్ రామస్వామి…
ఇక ప్రస్తుతం సూర్యతో చేయబోయే సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని ఈ సినిమాలో మరో సంజయ్ రామస్వామిని చూస్తారు అంటూ ఈ సినిమా పట్ల అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాతనే తిరిగి దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ 2 పనులు ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె వరస సౌత్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.
Also Read: Pallavi Prashanth: జైలు జీవితం ఎన్నో నేర్పింది.. బౌన్సర్లను అందుకే పెట్టుకున్నా!