Vande Bharat Express: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అప్ లైన్‌లో ఓ ఎద్దును ఢీ కొట్టింది. దీంతో కొన్ని నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో ఎద్దు చనిపోయింది. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ఎద్దును తొలగించి లైన్ క్లియర్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఈ ఘటన ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో చోటు చేసుకుంది.
ఇతర రైళ్ల కంటే వేగవంతంగా ప్రయాణించే వందే భారత్ రైలు.. ఇంజిన్ ముందు భాగానికి మాత్రం డ్యామేజ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎద్దును ఢీ కొట్టడంతో ఇంజన్ భాగంలో లైట్ కవర్, ప్యానల్ డ్యామేజ్ అయినట్లు అధికారులు గుర్తించారు.
దాదాపు 20 నిమిషాలపాటు రైలు అక్కడే నిలిచిపోయింది. ఈ సమయంలో ప్రయాణికులు కాస్త గందరగోళానికి లోనయ్యారు. ట్రైన్‌లోని సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణికులకు తగిన సమాచారం ఇచ్చి వారిని శాంతపరిచారు. వెంటనే రైల్వే రక్షణ బృందం (RPF), సాంకేతిక సిబ్బంది సహాయంతో ఎద్దు మృతదేహాన్ని రైలు మార్గం నుండి తొలగించారు. ఆపై ట్రైన్ తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఎంతో ఊరటనిచ్చింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా.. రైల్వే మార్గాల వద్ద మేతకు వచ్చే పశువులను నివారించేందుకు.. తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వేగవంతమైన రైళ్లకు ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: 180 ఏళ్లు నడిచిన రాయల్ రైలుకు గుడ్ బై, చివరి స్టాప్ కు చేరేది ఎప్పుడంటే?
రైల్వే అధికారులు కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇంజన్‌కు కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. పశువుల యజమానుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా.. జాగ్రత్తలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.