E-Paper
Advertisement

Uday Kiran : ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు ఏం మాట్లాడాడంటే? సంచలన విషయాలు బయటపెట్టిన డైరెక్టర్

Uday Kiran : ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు ఏం మాట్లాడాడంటే? సంచలన విషయాలు బయటపెట్టిన డైరెక్టర్
Advertisement

Uday Kiran : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉండే సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ విఎన్ ఆదిత్య ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు విఎన్ ఆదిత్య కెరియర్ లో ఉన్నాయి. ముఖ్యంగా విఎన్ ఆదిత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. బావగారు బాగున్నారా, భైరవద్వీపం వంటి సినిమాలకు కూడా ఆదిత్య పని చేశారు. ఒక తరుణంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కూడా సినిమా చేసే అవకాశం వచ్చి మిస్ అయిపోయింది.

విఎన్ ఆదిత్య ఎన్ని సినిమాలు చేసినా కూడా అతని దర్శకత్వంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమాకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ సినిమాతో ఒక అద్భుతమైన లవ్ స్టోరీని వెండి తెరపై ఆవిష్కరించాడు. ఇప్పటికీ కూడా చూస్తుంటే ఆ సినిమా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. ఆ సినిమా ఉదయ్ కిరణ్ కెరీర్ ని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళిపోయింది. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ అయిపోయాడు. ఉదయ్ క్రేజ్ ను ఇప్పుడు మాటల్లో వివరించలేము.

Advertisement

ఉదయ్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. పూర్తిస్థాయిలో కారణాలు తెలివి కానీ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఉదయం మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఉదయ్ తో ఆదిత్య కు మంచి బాండింగ్ ఉంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు చెప్పారు విఎన్ ఆదిత్య.

నాతో చివరిగా మాట్లాడిన మాటలు 

వెయ్యనాదిత్య ప్రస్తుతం ఫణి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకృతి సంరక్షణ గురించి ఉండబోతుంది. ఈ సినిమాలు కేథరీన్ ట్రెసా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో హస్బెండ్ పాత్రకి ఉదయ్ కిరణ్ సరిగ్గా సరిపోయే వాడట. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు సెట్స్ లో తన గురించి ఆలోచించారట ఆదిత్య.

Advertisement

అన్ని కోణాలు కూడా ఈ హస్బెండ్ పాత్రకి ఉంటాయట. ఈ తరుణంలోనే ఉదయ్ తనతో మాట్లాడిన చివరి మాటలను గుర్తుచేసుకొని ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు ఆదిత్య.

ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ఆరు రోజులు ముందు ఆదిత్య కు ఫోన్ చేశారు. చాలా హుషారుగా మాట్లాడారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అయింది అని ఆనందంలో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాస్ కమర్షియల్ హీరో ఒక్క ఫ్యామిలీ డ్రామా చేసి హిట్టు కొట్టారు. అతని ఇమేజ్ కంటే కూడా ఒక చిన్న భావోద్వేగాలతో కూడిన కథను చేశారు. ఈ జోనరా సినిమాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు కూడా మనకి బెటర్ అవుతుంది అని ఉదయ్ కిరణ్ ఆదిత్యతో మాట్లాడారు.

ఇలాంటి కథలు రాయండి 

ఇటువంటి సినిమాలు హిట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి కథలు మనం కూడా రాద్దాము. లేదంటే మీరు ఎవరి దగ్గరైనా వినండి అని ఆదిత్య కు ఉదయ్ కిరణ్ చెప్పారు. అయితే అంతకుముందే మనసంతా నువ్వే 2 సినిమా చేద్దాము అంటే వద్దు అన్నారట ఉదయ్. ఫ్యామిలీ సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఒక మాస్ కథ కావాలి అని అడిగేవారట.

అటువంటిది అత్తారింటికి దారేది సినిమా హిట్ తర్వాత అతను మాట్లాడిన మాటలు చాలా హుషారుగా అనిపించాయి. దాదాపు 5 6 గంటలు మాట్లాడుకున్నాం. ఆ తరువాత ఆరు రోజులకు చనిపోయాడు.

Also Read: Spirit : ఉమెన్స్ కాలేజీలో స్పిరిట్ మూవీ షూటింగ్, ప్రభాస్ జాయిన్ అయ్యేది అప్పుడే

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×