Bhairavam OTT:దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో మంచు మనోజ్ (Manchu Manoj)చేసిన చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్ (Nara Rohit) మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో దివ్యాపిళ్ళై, అదితి శంకర్ , ఆనంది హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యింది. మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే థియేటర్లలో సినిమాను మిస్సయిన ఆడియన్స్ ఓటిటిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి అభిమానులకు చిత్ర బృందం శుభవార్త అందించింది.
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన భైరవం..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. భైరవం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ 5 లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. జూలై 18వ తేదీ నుంచి తెలుగు, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. ఇటు ఓటీటీలో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
భైరవం సినిమా విశేషాలు..
భైరవం సినిమా విషయానికి వస్తే.. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ఈ సినిమా తమిళ హిట్ మూవీ గరుడన్ ఆధారంగా డాక్టర్ జయంతి లాల్ గడ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించారు. విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందించారు.
భైరవం సినిమా కలెక్షన్స్..
భైరవం సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.19 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. భారత దేశంలో రూ.11.96 కోట్లు వసూలు చేయగా.. అటు ప్రపంచవ్యాప్తంగా రూ.14.6 కోట్లు వసూలు చేసినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. అంటే దాదాపు 70% రికవరీ సాధించింది. అటు ఓవర్సీస్ లో 55 లక్షలు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ఫస్ట్ షార్ట్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విలన్ గా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు మంచు మనోజ్. ఇన్ని రోజులు హీరోగా అటు కామెడీ కూడా పండించిన ఈయన ఇప్పుడు విలన్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
also read:Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌కు తీవ్ర అవమానం.. పాపం కుమిలిపోయింది!
Powerful. Intense. A story that leaves you with an afterthought – BHAIRAVAM
Get ready for a high voltage thriller
Premieres 18th Jul@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @DirVijayK @AditiShankarofl @anandhiactress @DivyaPillaioffl @KKRadhamohan @dophari @satyarshi4u pic.twitter.com/3i6s0aKJKI
— ZEE5 Telugu (@ZEE5Telugu) July 8, 2025