BigTV English

Mega157: సగం పూర్తయిన సినిమాకే ఓటీటీ సెట్, ఆ సినిమా పరిస్థితి ఏంటి చిరంజీవా.?

Mega157: సగం పూర్తయిన సినిమాకే ఓటీటీ సెట్, ఆ సినిమా పరిస్థితి ఏంటి చిరంజీవా.?

Mega157: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మితమవుతున్న భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్ లన్ని కూడా ఓటీటీ సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దారుణమైన పరిణామం అని చెప్పాలి. సినిమాలు వాళ్ల కోసం నిర్మించే స్థాయికి వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. దీనికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఏకమై సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటిటి వలన హడావిడిగా విడుదల అయిపోయాయి.


చాలామంది తెలుగు సినిమా నిర్మాతలు కూడా దీని గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, సురేష్ బాబు, సునీల్ వంటి వాళ్లు ఇప్పటికే ఓటిటి వలన సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కుబేర సినిమాను కూడా ఓటిపి ఇచ్చిన కమిట్మెంట్ వలన రిలీజ్ చేస్తున్నమంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు సునీల్.

సగం పూర్తయిన సినిమాకి ఓటిటి డీల్ 


మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాల్157 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమాకి సంబంధించిన థర్డ్ షెడ్యూల్ నేడు మొదలైంది. ఈ షెడ్యూల్ నెల 22న కేరళలో పూర్తికానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓటిటి డీల్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం చాలా ఏళ్ళు తర్వాత మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చూపించబోతున్నాడు అనిల్. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోని చాలా కామెడీగా డిజైన్ చేశాడు అనిల్.

ఒక కొలిక్కిరాని విశ్వంభరా ఓటిటి డీల్

వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమా విశ్వంభరా. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉండేవి. చాలా ఏళ్ళు తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సోసియో ఫాంటసీ సినిమా అని చాలామంది సంబరపడ్డారు. ఈ సినిమాను జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో కూడా పోల్చారు. అప్పటికే బింబిసారా సినిమా సూపర్ హిట్ అవడంతో మెగాస్టార్ చిరంజీవికి అదిరిపోయే హిట్ వశిష్ట ఇస్తాడు అని అందరూ నమ్మారు. కానీ ఈ సినిమా టీజర్ వచ్చిన తర్వాత కొంతమేరకు అంచనాలు తగ్గిపోయాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాకుండా వాయిదా పడిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ చాలానే పెండింగ్ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఓటిటి డీల్ ఇప్పటివరకు ఫినిష్ కాలేదు. సినిమా పూర్తి అయిపోయిన కూడా ఓటిటి డీల్ ఈ సినిమాకు పూర్తి కాలేదు.

Also Read : Fish Venkat -Vishwak Sen: ఫిష్ వెంకట్ కు అండగా హీరో విశ్వక్.. టాలీవుడ్ ఇప్పుడు మేల్కొంటుందా?

Related News

Teja Sajja: అంత మంచి సినిమా ఎలా వదిలేసావు భయ్యా?

Bandla Ganesh: కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ, బండ్లన్న కొత్త భజన?

Teja Sajja: ఒక పెద్ద దర్శకుడు నన్ను మోసం చేశాడు

Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు

Big Stories

×