BigTV English

Disco Shanti: 28 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో భార్య.. ఇప్పుడైనా కలిసొస్తుందా?

Disco Shanti: 28 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో భార్య.. ఇప్పుడైనా కలిసొస్తుందా?

Disco Shanti:ఈ మధ్యకాలంలో చాలామంది రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ తమ ఆదాయాన్ని, ఉనికిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే దివంగత స్టార్ హీరో భార్య డిస్కో శాంతి (Disco Shanti) కూడా ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే 28 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చు. మరి డిస్కో శాంతి ఏ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు ? ఆమె పాత్ర ఏంటి? అనే విషయాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


28 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న డిస్కో శాంతి..

1980- 90 దశకాలలో తన నటనతో, డ్యాన్స్ లతో ప్రేక్షకులను మెప్పించారు డిస్కో శాంతి. తాజాగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence), ఆయన సోదరుడు ఎల్విన్ లారెన్స్ (Elvin Lawrence) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బుల్లెట్’. ఈ చిత్రంతోనే ఆమె వెండితెరకు పరిచయం కాబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా నుండి నిన్న టీజర్ విడుదల చేయగా.. ఈ టీజర్ లో డిస్కో శాంతి జోష్యం చెప్పే కీలక పాత్రలో కనిపించింది. ఈ పాత్రలో ఈమెను చూడగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. తమ అభిమాన హీరో శ్రీహరి (Srihari) భార్య మళ్ళీ సినిమాలలో కనిపించబోతోంది అని తెలిసి సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ సినిమా డిస్కో శాంతికి మంచి గుర్తింపు ఇవ్వాలి అని ,ఆమె మళ్ళీ వరుస అవకాశాలు అందుకోవాలని కూడా కోరుకుంటున్నారు.


డిస్కో శాంతి వ్యక్తిగత జీవితం..

1980వ దశకంలో తెలుగు నృత్యతారగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. రియల్ హీరోగా పేరు సొంతం చేసుకున్న దివంగత స్టార్ హీరో శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక ఈమె చెల్లెలు ఎవరో కాదు లలిత కుమారి (Lalitha Kumari). తమిళ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ను వివాహం చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2009లో విడాకులు తీసుకున్నారు. ఇక తర్వాత ప్రకాష్ రాజ్ ఇంకొక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లలిత కుమారి కూతుర్లు అటు ప్రకాష్ రాజ్ తో ఇటు తల్లితో ఉంటున్నారు.

డిస్కో శాంతి కెరియర్..

డిస్కో శాంతి ఎవరో కాదు పలు చిత్రాలలో నటించి తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న తమిళనాడు సీ.ఎల్. ఆనందన్ కూతురు. ఇక ఈమె తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన తర్వాత రౌడీ అల్లుడు , క్షణం క్షణం భయం భయం, కుట్ర, ధర్మపీఠం దద్దరిల్లింది, నేటి యుగధర్మం, రాక్షస సంహారం, వీర విహారం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలలోనే తన డాన్స్ తో భారీ పాపులారిటీ అందుకుంది. ఇక శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. శ్రీహరి మరణంతో ఒంటరి అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోంది.

ALSO READ:HBD Mahesh Babu: తెలుగులో ఆ ఘనత అందుకున్న ఏకైక హీరో!

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×