OTT Movie : థ్రిల్లర్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ లో వచ్చే ఒక్కో ట్విస్ట్ ఆడియన్స్ ను ఎంగేజింగ్ గా ఉంచుతుంది. అందుకే మూవీ లవర్స్ ఇలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఈ జానర్ సినిమాలను చూడాలనుకుంటే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? మూవీ పేరేంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్
Sin – Whispers of Guilt బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్, అరుణవ ఖస్నోబిస్ దర్శకత్వంలో, సురిందర్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ 2023 డిసెంబర్ 22న అడ్డాటైమ్స్ అనే ఓటీటీలో విడుదలైంది. సహిదుర్ రహమాన్, త్రిధా చౌదరి, ప్రతీక్ దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ నిడివి 5 గంటల 36 నిమిషాలు (8 ఎపిసోడ్‌లు, ప్రతి ఎపిసోడ్ సుమారు 42 నిమిషాలు) ఉంటుంది. ఈ సిరీస్ IMDbలో 7.9 రేటింగ్ ఉంది. ఇది సస్పెన్స్‌తో కూడిన క్రైమ్ డ్రామా, కలకత్తాలో జరిగే ఒక హత్య చుట్టూ తిరుగుతుంది.
స్టోరీలోకి వెళ్తే…
కథ కలకత్తాలో ఒక యువతి హత్యతో ప్రారంభమవుతుంది. ఆ శవం పక్కన ఒక వెరైటీ చిహ్నం ఉంటుంది. ఇది గతంలోని కొన్ని దెయ్యాల స్టోరీలను తిరిగి తెరపైకి తెస్తుంది. సమర్ సక్సేనా (సహిదుర్ రహమాన్) అనే మాజీ పోలీసు అధికారి ఉంటాడు. రెండు సంవత్సరాల క్రితం ఒక దుర్ఘటనలో తన స్నేహితులతో విభేదాల కారణంగా అతని లైఫ్ చిన్నాభిన్నం అవుతుంది. తరచుగా ఈ పోలీస్ ఆఫీసర్ కు దెయ్యాలు కన్పిస్తూ, ఇబ్బంది పెడతాయి.
అయితే ఈ హత్య కేసును పరిష్కరించడానికి సమర్ మళ్ళీ రంగంలోకి దిగుతాడు. సమర్ స్నేహితుడు అనంత (ప్రతీక్ దత్తా), ఈ కేసుకు మరో అమ్మాయిల రాకెట్‌తో సంబంధం ఉందని నమ్ముతాడు. సమర్ స్నేహితురాలు రూమి చటర్జీ (త్రిధా చౌదరి) ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. అతను సమర్‌కు ఈ ఇన్వెస్టిగేషన్ లో సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే రూమి సీక్రెట్స్ ను బయట పెడుతోంది. ఇన్వెస్టిగేషన్ లో కథలో మోహన అనే పాత్ర విషాద గతం బయట పడుతుంది. సమర్ తన ధైర్యం, నిజాయితీ కారణంగా సస్పెన్షన్‌కు గురవుతాడు.
Read Also :టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే
ఎపిసోడ్‌లు ముందుకు సాగే కొద్దీ, హత్య సీక్రెట్ ఒక అవినీతి కుంభకోణంతో ముడిపడి ఉంటుంది. చివరి ఎపిసోడ్ “సాంగ్ ఆఫ్ లైఫ్” క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంటుంది. ఈ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు ఉంటాయి. అయితే సినిమాలో క్రైమ్ సీన్స్ దారుణంగా ఉంటాయి కాబట్టి పెద్దలు మాత్రమే చూడడం బెటర్.