Fish Venkat: టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat)మరణించి దాదాపు వారం రోజులు అవుతున్న ఇప్పటికీ ఈయన మరణానికి సంబంధించి ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి. ఫిష్ వెంకట్ భార్య ఆయన మరణం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.. తన భర్తకు షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.. దాదాపు 20 సంవత్సరాల నుంచి షుగర్ సమస్యతో బాధపడుతున్నారని అయితే గత ఐదు సంవత్సరాలుగా కిడ్నీ సమస్య మొదలైందని ఫిష్ వెంకట్ భార్య ఈ సందర్భంగా తెలియజేశారు. గత 20 సంవత్సరాలుగా షుగర్ తో బాధపడుతున్న ఆయనకు డీజె టిల్లు సినిమా(D.J.Tillu) షూటింగ్ సమయంలో గాయమైందని తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా తనకు కొత్త షూస్ ఇచ్చారట అయితే ఆ షూస్ లో చిన్న మేకు కాలికి గుచ్చుకోవడం వల్లే కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని తెలిపారు.
మేకు గుచ్చుకోవడం వల్లే?
ఇలా కాలికి గుచ్చుకోవటంతో షుగర్ కారణంగా ఆ సమస్య పెద్దగా అయిందని అయితే అప్పటికే డాక్టర్లను సంప్రదించి సర్జరీ కూడా చేయించామని తెలిపారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు సూచించారు అయినప్పటికీ ఈయన మాత్రం తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి పెద్ద ఎత్తున మందు తాగడం, నాన్ వెజ్ తినడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా బయటపడ్డాయని ఫిష్ వెంకట్ భార్య తెలిపారు. ఇక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పటినుంచి ఎన్నో హాస్పిటల్స్ చూపించిన లాభం లేకుండా పోయిందని కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పినట్లు వెల్లడించారు అయితే కిడ్నీ మార్పిడి కోసం సరిపడా డబ్బు మా దగ్గర లేకుండా పోయిందని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ కాల్ చేసిన ప్రభాస్ పీ.ఏ…
మా ఆయన ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించారు. అయితే ప్రతి ఒక్కరూ ఒక్కో లక్ష రూపాయలు సహాయం చేసిన ఈరోజు ఆయన బ్రతికుండేవారు అంటూ ఆవేదన చెందారు. ఇక ఫిష్ వెంకట్ ఆరోగ్య విషయంలో ఎంతోమంది ఫేక్ కాల్స్ చేసి లేనిపోని ఆశలు కల్పించినట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రభాస్ పిఏ(Prabhas P.A) ఫోన్ చేసి సర్జరీకి అవసరమయ్యే 50 లక్షలు తానిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే అయితే అది ఫేక్ కాల్ అని కూడా తర్వాత వెళ్లడయింది.
రూ. 5 లక్షల సాయం…
ఇకపోతే మరోసారి కూడా ప్రభాస్ పిఏ అంటూ ఒక ఫేక్ కాల్ వచ్చిందని ఆయన మాట్లాడుతూ మీ ఆయనకు మందు, గుట్కా వంటి అలవాట్లు ఉన్న నేపథ్యంలోనే ప్రభాస్ సహాయం చేయలేదని చెప్పినట్టు ఫిష్ వెంకట్ భార్య వెల్లడించారు. ఇలా ఫేక్ కాల్స్ చేయటం వల్ల మాకు ఎవరైనా సహాయం చేయాలనుకున్న వారు కూడా ముందుకు రాలేకపోయారని ఈమె తెలిపారు. ఇండస్ట్రీ నుంచి పెద్ద సెలబ్రిటీలు ఎవరు స్పందించకపోయిన పలువురు ఆర్థికంగా సహాయం చేశారు. ఇలా అందరూ సహాయం చేసిన డబ్బులు సుమారు 5 లక్షల వరకు వచ్చిందని అందులో రూ. 4.5 లక్షలు హాస్పిటల్ బిల్ కట్టమని క్లారిటీ ఇచ్చారు.. ఇలా ఫిష్ వెంకట్ భార్య ఆయన మరణం పై స్పందిస్తూ తన మరణానికి గల కారణాలను వెల్లడించడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
Also Read: Boney Kapoor: ఓయమ్మా..26 కేజీలు తగ్గిన బడా ప్రొడ్యూసర్.. ఇలా మారిపోయాడు ఏంటి?