Boney Kapoor: సినిమా ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబాలలో కపూర్ కుటుంబం(Kapoor Family) కూడా ఒకటి. కపూర్ ఫ్యామిలీకి చెందిన బోనీ కపూర్ (Boney Kapoor)ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన సతీమణి దివంగత నటి శ్రీదేవి (Sri devi)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీని శాసించారు. అయితే శ్రీదేవి అకాల మరణం ఇండస్ట్రీకి తీరనిలోటు అని చెప్పాలి. శ్రీదేవి మరణం అనంతరం ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kappor) ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయారు.
పూర్తిగా సన్నబడిన బోనీకపూర్…
ఇదివరకు జాన్వీ కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తుండేవారు కానీ ఇటీవల తెలుగు సినిమాలకు కూడా కమిట్ అవుతూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఇటీవల ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా(Peddi Movie)లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా నిర్మాత బోని కపూర్ కు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోలో ఈయన గుర్తుపట్టలేని విధంగా ఉన్నారని చెప్పాలి.
బోనికపూర్ డైట్ సీక్రెట్…
ఇదివరకు కాస్త లావుగా కనిపించే బోని కపూర్ చాలా సన్నగా మారిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక్క సారిగా బోని కపూర్ ఇలా బరువు తగ్గడానికి(Weight Loss) గల కారణం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. 69 సంవత్సరాల వయసులో ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తలు వహిస్తున్న ఈయన కఠినమైన వ్యాయామాలు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ ఏకంగా 26 కేజీల బరువు తగ్గిపోయారని తెలుస్తోంది.ఈ విధంగా బోనీ కపూర్ బరువు తగ్గడం వెనుక గల కారణాలు ఏంటి ఆయన ఆహారపు అలవాట్లు ఏంటి అనే విషయానికి వస్తే.. బరువు తగ్గడం కోసం బోనీ కపూర్ రాత్రిపూట పూర్తిగా భోజనం మానేసి పోషక విలువలతో కూడిన సూపు మాత్రమే తీసుకునే వారని తెలుస్తోంది.
కఠినమైన డైట్…
ప్రతిరోజు ఉదయం జొన్న రొట్టెలు, పండ్లు వంటి వాటిని మాత్రమే తీసుకుంటూ డైట్ ఫాలో అయ్యారని ఇలా కఠినమైన డైట్ ఫాలో అయిన నేపథ్యంలోనే 26 కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది. ఇలా ఈ వయసులో ఈ స్థాయిలో బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉండగా తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ (Khushi Kapoor)ఇద్దరూ హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఖుషి కపూర్ కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటించగా, జాన్వీ మాత్రం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ తన హవా కొనసాగిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: నా దృష్టిలో సినిమా అంటే ఎడ్యుటైన్మెంట్.. కొత్త అర్థం చెప్పిన పవన్!