War 2 Event : టాలివుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కు వాచ్ ల కలెక్ష అంటే కూడా చాలా ఇష్టం.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.. ఏదైనా బ్రాండెడ్ వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు అయిన వెనక్కి తగ్గడు. ఎంత ఖర్చు అయిన దాన్ని కొనుగోలు చేస్తుంటారు.. ఇప్పటికే ఎన్నో వాచ్ లు ఉన్నాయి.. తాజాగా మరో బ్రాండెడ్ వాచ్ ను ఎన్టీఆర్ ధరించారు.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ కాస్ట్ కొన్ని కోట్లు.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఆయన వాచ్ ధర హాట్ టాపిక్ అవుతుంది..
ఎన్టీఆర్ వాచ్ ఎంతంటే..?
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జంటగా నటించిన రీసెంట్ మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2.. ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ హృతిక్ రోషన్ , టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో హాట్ టాపిక్ అవుతుంది. వార్ 2 సినిమా 2025 ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు..ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ బ్లాక్ అండ్ బ్లాక్ లో డ్రెస్ లో వచ్చాడు. కానీ ఆయన వాచ్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కోట్లు విలువ చేసే ఈ వాచ్ ఖరీదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఆడమర్స్ పిగెట్ రాయల్ ఓకే డబుల్ వీల్ ఓపెన్ వర్క్.. ఈ కంపెనీ వాచ్ చూడటానికి స్టైల్ గా ఉండటం మాత్రమే కాదు… కాస్ట్ కూడా ఎక్కువ.. దీని విలువ దాదాపుగా నాలుగు కోట్లు ఉంటుందని అంచనా..
ఎన్టీఆర్ కు వాచ్ లంటే ఇష్టం..
ఎన్టీఆర్ తో ఎన్నో ఖరీదైన వాచ్ లు ఉన్నాయి. వాచ్ లు అంటే కూడా ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువగా ఎన్టీఆర్ కోసం వారి సన్నిహితులు కూడా ఖరీదైన వాచ్ లను కానుకగా అందిస్తూ ఉంటారు. ఇక తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా గతంలో కూడా విలువైన ఒక వాచ్ ను కూడా కానుకగా ఇచ్చాడట. అది దాదాపు రూ. 1 కోటి ఖరీదు చేసిన లగ్జరీ వాచ్ అని తెలుస్తోంది.. ఈ మధ్య ఏ ఫంక్షన్ లో చూసిన ఈయన వాచ్ హైలెట్ అవుతున్నాయి.
వార్ 2 మూవీ…
ఈ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల అవుతోంది.. అయాన్ ముఖర్జీ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.. సినిమాలోని హైలైట్ సాంగ్ ‘జనాబే ఆలీ. ఇందులో హృతిక్ – ఎన్టీఆర్ మధ్య ఒక డ్యాన్స్ వార్ ఉండనుందని టాక్.. వార్ 2 సినిమా 2025 ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.. భారీ అంచనాలతో రాబోతున్న ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..