E-Paper
Advertisement

AIswarya Lakshmi :హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఏం చదివిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..

AIswarya Lakshmi :హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఏం చదివిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..
Advertisement

AIswarya Lakshmi : మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు తెలుగులో మంచి డిమాండ్ ఉందన్న విషయం.. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి జనాలను తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి క్రేజీ హీరోయిన్లలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మీ ఒకరు. ఈమె అఖిల్ అక్కినేని సరసన హలో, సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి నటిగా గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే ఆ తర్వాత ఎక్కువగా మలయాళ సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసింది.. అందులో ఆమె చదువు గురించి పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

ఐశ్వర్య లక్ష్మీ ఏం చదివింది..?

మలయాళ క్రేజీ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ 2017 లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మాయానది’, ‘వరతన్’ చిత్రాలతో మలయాళ ప్రేక్షకులను మెప్పించారు.. అయితే మలయాళం తో పాటుగా తమిళ చిత్రాలలో కూడా నటించింది.. అంతేకాదు.. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇటీవల ఈమె సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పెద్దగా సోషల్ మీడియాలో కనిపించినట్టు తెలుస్తుంది. అయితే ఈ అమ్మడు గతంలో తన డాక్టర్ చదువు గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నా చదువులు పూర్తి చేశాను. కానీ ఇప్పుడు ఆ చదువుకు విలువ లేకుండా పోయింది. జనాలకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం నాకు దొరకలేదు అని ఆమె అన్న మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇది కాస్త వైరల్ అవ్వడంతో ఈ మలయాళ ముద్దుగుమ్మ డాక్టర్ చదివిందా అని పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా చాలామంది హీరోయిన్లు డాక్టర్ చదివి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.

Advertisement

Also Read :ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్..

ఐశ్వర్య సినిమాల విషయానికొస్తే..

ఐశ్వర్య లక్ష్మి మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్.. ఈమె ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ ని అందుకుంది. అంతేకాదు ఆమె నటించిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన కొత్త లోక మూవీ ఆమెకు ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అంతే కాదు ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైన గా సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. చివరగా ఈమె నటించిన సినిమా గట్ట కుస్తీ.. ప్రస్తుతం, జోజు జార్జ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆశా’ ఐశ్వర్య కొత్త సినిమా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. జనాలని బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం..

Related News

రీరిలీజ్ కి సిద్ధమైన పవర్ స్టార్ మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ మూవీ.. ఎప్పుడంటే?

చిక్కుల్లో పడ్డ మోహన్ లాల్.. ఉత్కంఠగా రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ!

మీరు ఆట మొదలుపెట్టారు.. ముగింపు ప్రజలే ఇస్తారు.. మరో సంచలన వీడియోతో ప్రకాష్ రాజ్!

Producer : సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

“అయ్యగారు అఖిల్”కి అభిమాని కొత్త పేరు.. భలే ఉందే!

ఏమంటివి.. ఏమంటివి..అన్నగారి డైలాగుతో అదరగొట్టేసిన భాగ్యశ్రీ!

” సేవ్ చేసిన రీల్స్ నిజమయ్యాయి”.. సాయి ధరమ్ తేజ్ కొత్త పోస్ట్! !

Big Stories

Advertisement
×