Film industry:సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా అయినా సరే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వస్తుంది. అయితే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా రిలీజ్ అయ్యే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు కానీ అదే సినిమా ఏదైనా వివాదంలో చిక్కుకుంది అంటే మాత్రం ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపించినా.. ఆ వివాదం తాలూకు ప్రభావం వల్ల సినిమా చాలా వరకు నష్టపోతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ నటుడు దిల్జిత్ నటించిన సట్లూజ్ మూవీ దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత ఈనెల 3వ తేదీ పంజాబ్ 95 పేరిట..ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఇకపోతే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే సినిమాను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఒక సినిమాని ఓటీటీ సంస్థ తొలగించడం అనేది సాహసోపేతమైన నిర్ణయం .. ఎందుకంటే ఆ సినిమా వాళ్లకు ఓటీటీ వాళ్లు డబ్బులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తారు. కాబట్టి అర్ధాంతరంగా ఆ సినిమాని ప్లాట్ ఫామ్ నుండి తీసివేయడం వల్ల అటు సినిమా వాళ్లకి ఇటు ఓటీటీ సంస్థకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది ముఖ్యంగా ఆ సినిమాను ఎందుకు ఓటీటీ నుంచి తొలగించారు అనే విషయం కూడా కచ్చితంగా చెప్పకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ నుండి తొలగించడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ సినిమాని ఇండియాలో స్ట్రీమింగ్ చేయడం కష్టం అంటూ జీ ఫైవ్ వాళ్లు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ నుంచి తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ సినిమా విషయానికి వస్తే.. పంజాబ్లో జరిగిన హత్యల పేరిట 2022లో వచ్చిన ‘పంజాబ్ 95’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ సెన్సార్ బోర్డు వాళ్ళు ఏకంగా 127 కట్లను విధించడంతో చేసేదేమీ లేక సినిమా పేరును కూడా మార్చి ఓటీటీ లో విడుదల చేశారు. అయితే ఇక్కడ కూడా కాంట్రవర్సీ అవుతుందనే ఆలోచనతోనే సంస్థ ఈ సినిమాను తొలగించడం జరిగింది. ఏది ఏమైనా ఈ సినిమా వల్ల అటు ఓటీటీకి కూడా భారీగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం . అందుకే సినిమా చేసేటప్పుడు కాంట్రవర్సీ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా తెరకెక్కించగలిగితే బాగుంటుందని మరికొంతమంది సినిమా మేధావులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ పంజాబ్ 95 సినిమా ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ నుండి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ALSO READ:మీరు ఆట మొదలుపెట్టారు.. ముగింపు ప్రజలే ఇస్తారు.. మరో సంచలన వీడియోతో ప్రకాష్ రాజ్!
పంజాబ్ 95 సినిమా విషయానికొస్తే.. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఒక జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా పాత్రలో దిల్జిత్ దోషాన్జ్ నటించిన ఈ సినిమా.. 1991 దశకంలో పోలీసులచే సిక్కు యువకులు చట్టేతర హత్యలు, రహస్య దహన సంస్కారాలను బహిర్గతం చేయడానికి చేపట్టిన ఒక భయంకరమైన పోరాటాన్ని ఈ చిత్రం వివరిస్తుంది. ఇక అలాంటి ఈ చిత్రాన్ని సట్లూజ్ పేరిట జి ఫైవ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేశారు. కానీ స్ట్రీమింగ్ చేసిన రెండు రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ఫారం నుండి తొలగించడం జరిగింది