E-Paper
Advertisement

Producer : సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

Producer : సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
Advertisement

Producer : ప్రముఖ సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డి పై పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే.. గత కొన్ని నెలల క్రితం ఈ వివాదం వార్తల్లో హైలెట్ అయ్యింది. సినిమా కన్న ఎక్కువగా ఏ వివాదము వార్తల్లో నిలవడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పుడు మరోసారి వార్తల్లో హైలెట్ అయింది. ప్రముఖ సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డి పై పోలీస్ కేసు నమోదు అవ్వడంతో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. కోట్ల రూపాయలు తీసుకొని తనని దారుణంగా మోసం చేశారని మరో నిర్మాత ఆయనపై పోలీస్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిర్మాత పై చీటింగ్ కేసు నమోదు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలేం జరిగింది? కేసు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ప్రముఖ నిర్మాత అనీష్ రెడ్డి పై పోలీస్ కేసు..

నిర్మాత అనీష్ రెడ్డి కోసం లోన్ తీసుకున్న మరో నిర్మాత రజిత్ రావు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పోలీస్ కేసు ఫైల్ చేశాడు.. అనీష్ రెడ్డి కోసం మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడు దగ్గర నుండి 40 లక్షలు ఇప్పించానని, అయితే అతని లోన్ క్లియర్ అయిన కూడా తనకి డబ్బులు చెల్లించలేదని రజిత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల గురించి అడిగితే బెదిరింపులకు దిగాడని నిర్మాత రజిత్ రావు పోలీసు ల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన కేసును ఫైల్ చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది..

Advertisement

Also Read : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నీతూ అవుట్..

‘మహారాగ్ని’ మూవీ విషయానికొస్తే..

ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ మహారాగ్ని.. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ థ్రిల్లర్ యాక్షన్ జోనర్ లో వచ్చింది.. ఇందులో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటించారు. వీరితో పాటు స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరులు నటించారు.. ప్రభుదేవా స్వాగ్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంది. బ్యూటీ సంయుక్త మీనన్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ లో కనిపిస్తుంది. ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ కావాల్సింది.. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ కేసు వల్ల మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఏది ఏమైనా ఈ కేసు వల్ల సినిమా విడుదల అవ్వడం కూడా కష్టమే అని ఇండస్ట్రీలో టాక్..

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×