E-Paper
Advertisement

చిక్కుల్లో పడ్డ మోహన్ లాల్.. ఉత్కంఠగా రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ!

చిక్కుల్లో పడ్డ మోహన్ లాల్.. ఉత్కంఠగా రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ!
Advertisement

Mohna Lal: ప్రముఖ మలయాళ స్టార్ హీరో మోహన్ లా(Mohan Lal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో ఒక్క మాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాష ఇండస్ట్రీలలో కూడా నటిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా హీరోగా నటించడమే కాకుండా ఇటు తండ్రి పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా అన్ని భాషా చిత్రాలలో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పైగా ఈయన అద్భుతమైన నటనను, సినీ పరిశ్రమకు చేసిన సేవను గుర్తించి “దాదాసాహెబ్ ఫాల్కే” అవార్డుతో సత్కరించారు కూడా.. అలాంటి ఈయన గత 15 ఏళ్లుగా ఒక కేసులో తలమునుకలవుతున్న విషయం తెలిసిందే.

15 ఏళ్లుగా హైకోర్టులో పోరాడుతున్న మోహన్ లాల్..

అయితే ఈ విషయంపై హైకోర్టులో విచారణ మరింత ఉత్కంఠగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేసిన పత్రాలు.. కేరళ హైకోర్టు ముందు ఉంచగా.. ఈ విషయం ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం?.. 2011 జూన్ నెలలో సినీ నటుడు మోహన్ లాల్ ఇల్లు కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఏకంగా 4 ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం అనుమతి లేకుండా ఏనుగు దంతాలను కలిగి ఉండడం చట్టరీత్యా నేరం కావడంతో కేరళ అటవీ శాఖ మోహన్ లాల్ పై కేసు నమోదు చేసింది.

Advertisement

ALSO READ:నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సినిమా.. కానీ 2 రోజులకే తొలగింపు?

లీగల్ ఓనర్షిప్ సర్టిఫికెట్ సరైన సమయంలోనే వచ్చిందా?

ఇకపోతే దాదాపు గత 15 సంవత్సరాలుగా ఈ కేసుకు సంబంధించి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరుగుతున్నాయి.కానీ ఇప్పుడు తాజాగా ఈ కేసులో భాగంగా మోహన్ లాల్ తరఫున సమర్పించిన నివేదికల ప్రకారం.. “మోహన్ లాల్ అటవీ శాఖ చట్టాలను ఉల్లంఘించలేదని.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్నెస్టీ పథకం కింద ఆస్తులను ముందే డిక్లేర్ చేశారని” ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అయితే మోహన్ లాల్ తన వద్ద ఉంచుకున్న 10 ఏనుగు దంతాలు , 13 దంతపు విగ్రహాలకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖకు వెల్లడించినప్పటికీ.. అటవీ శాఖ నుంచి వీటికి సంబంధించిన లీగల్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ సరైన సమయంలో పొందారా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ సాగుతోంది.

ఉత్కంఠ రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ..

Advertisement

మరి హైకోర్టులో జరుగుతున్న ఈ విచారణ ఉత్కంఠ రేకెత్తిస్తున్న నేపథ్యంలో మోహన్ లాల్ కు న్యాయం జరుగుతుందా? లేదా ?అసలు తప్పు ఎక్కడ జరిగింది? సరైన సమయంలో ఓనర్ షిప్ సర్టిఫికెట్ పొందారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరి మోహన్ లాల్ ఈ కేసు నుంచి బయటపడతారా? లేదా? అని అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం

Related News

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×