Pawan Kalyan:అభిమాన హీరోల సినిమాలు ప్రస్తుతం లేకపోతే.. ఆయా హీరోల కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రాలను మళ్లీ మళ్లీ విడుదల చేస్తూ ఆడియన్స్ థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీల లైఫ్ కి సంబంధించిన అకేషన్ ఏదైనా ఉంది అంటే.. అది బర్తడే కావచ్చు లేదా పెళ్లి రోజు కావచ్చు లేదా ఇంకా మరేదైనా స్పెషల్ సందర్భం ఉంటే చాలు ఆయా హీరోల కెరియర్ లో హిట్ గాగా నిలిచిన చిత్రాలతో పాటూ కల్ట్ క్లాసిక్ గా నిలిచి, థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలను కూడా రీ రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్నో రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఓజీ కంటే ముందే మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ మూవీగా నిలిచిన ఒక సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి ఆ సినిమా ఏంటి? ఎప్పుడు రిలీజ్ అవుతోంది ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు హీరోగా.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా మారారు. ముఖ్యంగా అభిమానులను అలరించడానికి ఒకవైపు సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పటివరకు వచ్చిన ఆయన చిత్రాలలో ఆయనను అత్యంత స్టైలిష్ గ్యాంగ్ స్టర్ అవతారంలో చూపించిన చిత్రం ఓజీ అని మాత్రమే అందరూ చెబుతారు. కానీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఓజీ కంటే ముందే పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ గ్యాంగ్ స్టర్ లుక్ లో చూపించిన చిత్రం పంజా..
also read:చిక్కుల్లో పడ్డ మోహన్ లాల్.. ఉత్కంఠగా రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ!
కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2011లో విడుదలై యావరేజ్ గా నిలిచింది. అయినా సరే పవన్ కళ్యాణ్ కెరియర్ లో మోస్ట్ స్టైలిష్ మూవీ గా నిలిచిపోయింది. ఇక ఇందులో పాటలు కూడా రిపీట్ మోడ్ లో వింటూ అభిమానులు మురిసిపోతుంటారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అనగా సెప్టెంబర్ 2వ తేదీన ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ను మళ్ళీ స్టైలిష్ అవతారంలో థియేటర్లలో చూడడానికి అభిమానులు సిద్ధమైపోయారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ బర్తడే నాడు (సెప్టెంబర్ 2) అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ను మళ్ళీ తెరపై ఈ కొత్త స్టైలిష్ లుక్ లో చూడడం అంటే ఆరోజు థియేటర్లలో విధ్వంసమే అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారా జేన్ డియాస్, అంజలి లవానియా , అడివి శేష్, ఆలీ, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ.. 2011 డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకాలపై నీలిమ తిరుమల శెట్టి , శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ , నగేష్ ముంతల కలసి సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. విష్ణువర్ధన్ పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ గ్యాంగ్ స్టార్ లుక్ లో చూపించి సక్సెస్ అయ్యారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద అసెట్ గా నిలిచింది. ఇకపోతే అప్పట్లో ఈ సినిమా ఐఎండీబీలో 6.5 రేటింగ్ కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. మరి ఈ కల్ట్ మ్యూజికల్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ మూవీ మళ్లీ థియేటర్లలో రిలీజ్ అయ్యి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.